ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ..మాజీ మంత్రి అయిన సీనియర్ నాయకుడు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు .రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గ నేత ,మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామీ వైసీపీ పార్టీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.ఈ క్రమంలో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ లేఖను రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు అయిన కళా వెంకట్రావు ,జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ లో పంపారు అని వార్తలు వస్తున్నాయి .
see also:ఏపీలో మరోసారి ఉప ఎన్నికలు..?
ఆ తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తన తనయుడు ,కాపు కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ యర్రా నవీన్ తో సహా వైసీపీ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో హాల్ చల్ చేస్తున్నాయి .గతంలో ఆయన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షులు, పొలిట్‌బ్యూరో సభ్యునిగా, పార్టీ జిల్లా కన్వీనర్‌తో పాటు మరెన్నో పదవులు చేపట్టి పార్టీకి ఎనలేని సేవలను అందించారు.
see also:కర్నూల్ జిల్లాలో ఉదయభానుని, కుమారున్ని గొంతు నులిమి చంపేసిన భర్త
ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నారాయణస్వామిని గవర్నర్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి.అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో నారాయణ రెండు జిల్లాలో ఉన్న కాపు సామాజిక వర్గానికి ఎంత చెబితే అంతా అన్నట్లు కూడా రాజకీయాలు సాగడం గమనార్హం ..
see also:అది జరిగితే..ఉరి వేసుకోవడానికి సిద్ధం ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు