ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో కీలక అనుమతులు లభించాయి.కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) నుంచి కీలక అనుమతులు లభించాయి.ఈ రోజు దేశ రాజధాని డిల్లీ లో జరిగిన సమావేశంలో అనుమతులు జారీ చేస్తున్నట్లు టీఏసీ తెలిపింది. ఈ అనుమతులు లభించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర, భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావులు హర్షం వ్యక్తం చేశారు. అనుమతులు మంజూరు చేసినందుకు గానూ కేంద్ర జల వనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
see also;సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్1 -ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..!