బాలీవుడ్ నుంచి తెలుగు సినిమాల వైపు వచ్చిన నటి అమైరా దస్తూర్. ‘మనసుకు నచ్చింది’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన అమైరా మరో సినిమా ‘రాజుగాడు’ కూడా గత వారంలో విడుదల అయ్యింది. అయితే ఈ రెండు సినిమాలూ ఫ్లాప్స్‌గానే మిగిలాయి. పాజిటివ్ అంచనాల మధ్యనే వచ్చిన ఈ రెండు సినిమాలూ కమర్షియల్‌గా ఫెయిల్యూర్స్ అయ్యాయి.
ఇలా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతూ రెండు ఫ్లాప్స్‌ను చవిచూసినా, అమైరా మాత్రం సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తోంది. హాట్ ఫొటోస్‌తో అదరగొట్టేస్తోంది. తాజాగా ఈ హీరోయిన్ ఇలా చిట్టిపొట్టి దుస్తుల్లో తన అందాలను ప్రదర్శించింది. ఈత కొలను పక్కన ఇలా పోజు ఇచ్చి టెంపరేచర్ పెంచేస్తోంది అమైరా. సినిమాల ఫలితాల సంగతెలా ఉన్నా.. ఈ అందాలను చూస్తే మాత్రం సరికొత్త అవకాశాలు వచ్చి అమైరాను వరించడం ఖాయం!