ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా తణుకు నియోజకవర్గంలో అడుగిడిన జగన్ కి అయితంపూడిలో పెద్దిరెడ్డిపాలెం, కంతేరు, గోటేరు, ఇరగవరం గ్రామాల మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. వైసీపీ పార్టీ రంగు చీరలను కట్టుకుని స్వాగతం చెప్పారు. జగనన్న సంకల్పం నెరవేరాలని ఆకాంక్షించారు.
ఈ నెల 6న ఢిల్లీలో ఏం జరగబోతోంది..??
మరోపక్క… ఎవరిని కదిపినా.. కన్నీటి గాథలే.. నాలుగేళ్ల టీడీపీ పాలనలో సంక్షేమం ఎరుగని పేదలే.. అటువంటి వారంతా జిల్లా సోమవారం నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమ కష్టాలు ఏకరువు పెట్టారు. మా రేపటి భవిష్యత్తు మీరేనయ్యా.. మీపైనే మా ఆశలు అన్నీ అంటూ సంఘీభావం ప్రకటించారు.