ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి నక్కా ఆనందబాబు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సమావేశం పెట్టి అరగంట మాట్లాడాడని, మాట్లాడింది అరగంటే అయినా.. 30 సార్లు సీఎం చంద్రబాబు జపం చేశారని ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్ తాపత్రయం దేనికోసమో ఏపీ ప్రజలకు తెలిసని, సీఎం పదవి కాంక్షతోనే చంద్రబాబుపై విమర్శలు చేయడం జగన్‌కు తగదని హితవుపలికారు మంత్రి నక్కా ఆనందబాబు. ఏందేంది.. చంద్రబాబును నీళ్లులేని బావిలో దూకమంటావా..? మొదట నిన్ను(జగన్‌ను) నీళ్లు ఉన్న సముద్రంలో కలుపుతారో.. లేక రాబందులకేస్తారో చూస్కో అంటూ వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
see also…
ఏపీలో ఇది టీడీపీ బలం..అది వైసీపీ బలం
సాక్ష్యాత్తు నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా చంద్రబాబును ఇలాగే విమర్శించారని, ఆ తరువాత ఏం జరిగింది..? వైఎస్ఆర్ అనంతవాయువుల్లో కలిసిపోయారన్నారు. ఇప్పుడు మీ తండ్రిలానే.. నీవు కూడా చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నావు కాబట్టి వైఎస్ఆర్‌కు పట్టిన గతే నీకు కూడా పడుతుందంటూ హెచ్చరించారు.