ఈ ఏడాది రాష్ట్ర హరితహారంలో భాగంగా పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులను పత్రికా ప్రకటనలో నేడు కోరారు. నేడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ దయతో మేం బాగున్నాం..!!
తెలంగాణ పాఠశాలలను హరిత పాఠశాలలుగా అభివృద్ధి చేసే సంకల్పంతో తెలంగాణ విద్యాశాఖ పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది వర్షాలు కూడా మంచిగా పడుతాయన్న వాతావరణ శాఖ సమాచారంతో పెద్దఎత్తున పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలన్నారు. విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పించడం, మొక్కల పరిరక్షణ బాధ్యతను వారికి అప్పగించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. గ్రీన్ బ్రిగేడ్ లను ఏర్పాటు చేసి నాటిన మొక్కలు వందశాతం పరిరక్షించాలన్నారు.