ఏపీ రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ..ఎందుకు ఉంటారో ..ఎవరు పార్టీ మారతారో అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి .నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగిన కానీ ఆ తర్వాత సీను రివర్స్ అయ్యి ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి
వలసల పర్వం కొనసాగుతుంది .ఈ క్రమంలో ప్రకాశం జిల్లా టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎమ్మెల్సీ తన తనయుడి భవిష్యత్తు కోసం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు జిల్లా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి .
నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు.. చంద్రబాబు నాయుడు సంచలన వాఖ్యలు
ఈ క్రమంలో ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ,ఎమ్మెల్సీ కరణం బలరాం దాదాపు ముప్పై ఐదేళ్ళ పాటు ఉన్న టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు అంట .గత సార్వత్రిక ఎన్నికల్లో తనపై గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ చేరిన రోజు నుండి నేటి వరకు ఇరువర్గాల మధ్య వర్గ పోరు .అంతే కాకుండా పలుమార్లు ఎంపీగా ..ఎమ్మెల్యేగా ..ఎమ్మెల్సీగా పని చేసి ముప్పై ఐదేళ్ళ పాటు పార్టీకోసం అహర్నిశలు కష్టపడిన తనను కాదని మద్యలో అధికారం కోసం పార్టీ మారిన గొట్టిపాటికి చంద్రబాబు నాయుడుతో పాటుగా జిల్లాకు చెందిన నేతలు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం ..కింది స్థాయి క్యాడర్ టీడీపీ పార్టీలో ఉండి అవమానాలను ఎదుర్కునే బదులు పార్టీ మారడం మంచిదని సూచించడంతో కరణం ఈ నిర్ణయంతీసుకున్నారు అంట .
కర్నూలు జిల్లాలో అరాచకం.. మహిళ జాకెట్ చింపి చితకబాదిన..టీడీపీ నేతలు
అంతే కాకుండా టీడీపీ మహానాడు సందర్భంగా చంద్రబాబును కల్సి వచ్చే ఎన్నికల్లో తన వారసుడు అయిన యువకుడు ,ప్రజల్లో మంచి పేరు ఉన్న కరణం వెంకటేష్ కు అవకాశం ఇవ్వాలని కోరారు అంట .అయితే గొట్టిపాటి పార్టీ మారే సమయంలోనే వచ్చే ఎన్నికల్లో అద్దంకి సీటు ఇస్తాను హామీ ఇవ్వడంతో కరణం బలరాం కు ఏమి మాట ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నాలు చేశారు చంద్రబాబు.
గుంటూరు జిల్లాలో మరో దారుణం ..కోడలిని వేధిస్తున్న టీడీపీ నేత
దీంతో ఘోర అవమానానికి గురైన కరణం మానసిక వేదనతో పార్టీ మారాలని ..వచ్చే ఎన్నికల్లో తన తనయుడ్ని వైసీపీ తరపున బరిలోకి దించి గెలిపించడమే కాకుండా జిల్లాలో వైసీపీ అన్ని స్థానాలు గెలవడంతో కీలక పాత్ర పోషించి ముప్పై ఐదేళ్ళ రాజకీయ అనుభవం దెబ్బ ఏమిటో బాబు అండ్ బ్యాచ్ కు రుచి చూపించాలనే కసితో ఉన్నారు అంట .ప్రస్తుతం
పాదయాత్రలో ఉన్న జగన్ ను త్వరలోనే కల్సి మంచి ముహూర్తం చూసి వైసీపీ గూటికి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలనీ తన అనుచవర్గం దగ్గర చెప్పారు .సో త్వరలోనే మరో సీనియర్ నేత టీడీపీ పార్టీ వీడనున్నారు అన్నమాట ..