తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం విజయవంతం అవుతున్న సంగతి తెలిసిందే .ఇప్పటికే దేశం నలుమూలల నుండి ఈ పథకానికి ప్రశంసలు లభిస్తున్నాయి.అందులోభాగంగానే తాజాగా రైతు బంధు పథకాన్ని ఆర్బీఐ ప్రశంసించింది.అయితే ఈ పథకం కింద ఇప్పటి వరకు రైతుల చేతుల్లోకి 5వేల 400 కోట్ల రూపాయలు చేరినట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడా నగదు కొరత సమస్య తలెత్తలేదని ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ సుబ్రమణియన్ స్పష్టం చేశారు.
కేసీఆర్ కిట్ అద్బుత నిర్ణయం.. తప్పక చదవండి.. నచ్చితే షేర్ చేయండి..
ఈ రోజు అయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు రైతుబంధు పథకానికి అనుకున్న సమయంలో అవసరమైన మొత్తంలో దాదాపు 95 శాతం నగదును బ్యాంకుల్లో సిద్ధంగా ఉంచామన్నారు. ఈ పథకం కింద నగదు పంపిణీ సంతృప్తికరంగా సాగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా రైతుల నుంచి ఫిర్యాదులు లేవన్నారు. రైతులంతా సంతృప్తిగా ఉన్నట్టు తమకు బ్యాంకుల నుంచి, రాష్ట్ర ఆర్థికశాఖ నుంచి సమాచారముందని చెప్పారు.ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నగదు కొరతలేదన్నారు. ఏటీఎంలలలో కూడా చాలినంత నగదును సిద్ధంగా ఉంచుతున్నట్టు చెప్పారు.