దేశవ్యాప్తంగా మే 6 న జరిగిన నీట్-2018 ఫలితాలను CBSE విడుదల చేసింది. నీట్- 2018 ఎగ్జామ్ ను 13 లక్షల మంది విద్యార్థులు రాయగా 7 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ క్రమంలోనే మెడికల్ మరియు డెంటల్ కోర్సుల కోసం నిర్వహించిన ఉమ్మడి పరీక్షలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. అందులోభాగంగానే తెలంగాణ విద్యార్థి రోహన్ పురోహిత్ 690 మార్కులతో రెండో ర్యాంకును సాధించాడు.
see also……
పచ్చదనాన్ని ప్రోత్సహించే వారందరికీ శుభాకాంక్షలు..కేసీఆర్
ఇక ఈ ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన వరుణ్ ముప్పడి 685 మార్కులతో ఆరో ర్యాంకును సాధించాడు. మరోవైపు నీట్ లో దివ్యాంగుల కాటగిరీలో తెలంగాణ విద్యార్థి ఫస్ట్ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. కరీంనగర్ కు చెందిన దేవసహాయం మొదటి ర్యాంకును దక్కించుకున్నాడు.