కాంగ్రెస్ నేతలపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద మండిపడ్డారు.తలకు పగిడీలు చుట్టుకుని, అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడితే అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు.సోమవారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.ప్రజల్లోకి వెళ్లకుండా, గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌నేతలు ఇంకా ఊహాలోకాల్లో విహరిస్తున్నారని అన్నారు . అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి.. ఇప్పుడు మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ కి వచ్చిన ఆదరణను కాంగ్రెస్ నేతలు ఓసారి గుర్తు చేసుకుంటే మంచిదని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో ఉన్నతాధికారులు..!!
హైదరాబాద్ నగర ప్రజలకు త్రాగు నీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇబ్బంది రాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కేశవాపురం దగ్గర 10 టీఎంసీల సమర్ధ్యం గల ఒక జలాశయాన్ని కట్టబోతున్నామని..దాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని అన్నారు.హైదరాబాద్ నగరంలో 10వేల సీసీ కెమరాలను అమర్చామని అన్నారు.షీ టిమ్స్ ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై స్పందిస్తూ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.హైదరాబాద్ మహానగరంలో త్రాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు 24గంటలు కరెంట్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్ని ఎమ్మెల్యే కె.పి వివేక్ అన్నారు.