ప్రతీ ఇంటికి రెండు మూడు నెలల్లో తాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు.ఈ పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు . మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతీ మైనార్టీ విద్యార్థిపై ఏటా లక్ష రూపాయలు ఖర్చుచేస్తున్నామని మంత్రి హరీష్ అన్నారు .
ఈ రోజు నుంచే రైతు బీమా సర్వే..!!
ఈ రోజు మెదక్ పట్టణంలో పర్యటించిన హరీష్… పేద ముస్లింలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడారు. షాదీ ముబారక్, షాదీ ఖానా ద్వారా మెదక్ లోని పేద ముస్లింలు తమ ఆడపిల్లల పెళ్లిళ్లను తక్కువ ఖర్చుతో చేయవచ్చన్నారు. ఈద్గా, మసీదు మరమ్మతులకు రూ. 2 కోట్లు ప్రభుత్వం అందిస్తుందన్నారు. అదే రీతిలో పేద మైనార్టీ విద్యార్థుల చదువు కోసం రాష్ట్రంలో 250 రెసిడెన్షియల్ పాఠశాల లను సీఎం ప్రారంభించారని చెప్పారు. మెదక్ లో ప్రస్తుతం ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కాకుండా మరోకటి బాలికల కోసం మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు .