తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కు మరియు గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న వివిధ సంక్షేమ ,అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ఇప్పటికే ప్రధాని మోదీ తో సహా పలువురు కేంద్రమంత్రులు ప్రశంసించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంసించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలపై కొనియాడారు .ఈ రోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వృద్దులు దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను పంపిణేచేసే కార్యక్రమంలో అయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయం..సాధికారత విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.తెలంగాణలో ఇప్పటికే 45కోట్ల రూపాయల ఖర్చుతో దివ్యాంగులకు కావాల్సిన పరికరాలను సమకూర్చామన్నారు. కులాంతర వివాహలు చేసుకుని.. పారితోషకాలను తీసుకున్న వారు కూడా రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నారని అన్నారు.