2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఘన విజయం సాధించిన సుమారు 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డబ్బు మూటలను ఎరగావేసి టీడీపీలో చేర్చుకున్న విషయం విధితమే. అయితే, టీడీపీలో చేరిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో జగన్‌ను విమర్శించిన వారికే సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి పదవులు ఇవ్వడం గమనార్హం.
వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియకు ఆళ్ళగడ్డ టీడీపీ టిక్కెట్టు ..ఉందా ..లేదా..నమ్మలేని నిజాలు..!
ఇదిలా ఉండగా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఎలాగైనా విజయం సాధించాలన్న సంకల్పతో వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా వైసీపీ నుంచి పిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ముందుగా ఫోకస్ పెట్టింది. ఆళ్లగడ్డ, జగ్గంపేట, విజయవాడ వెస్ట్, కొడుమూరు, పాడేరు, పలమనేరు, నంద్యాల, గిద్దలూరు, జమ్మలమడుగు వంటి నియోజకవర్గాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టారట.
అందులో భాగంగా మొదటగా ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారట. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ తరుపున అభ్యర్థులుగా ఎవరిని నియమించాలి..? అన్న ప్రధానమైన అంశాలపై వైసీపీ సర్వే చేయిస్తోంది. వైసీపీ సర్వే అంశంపై చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నారట. అయితే, వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మళ్లీ వారికే అవకాశం ఇస్తే.. వారికి ఓటమి తప్పదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. సానుభూతి పేరిట 2019లో వైసీపీ అభ్యర్థులకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు 2019లో ఎదురుదెబ్బ తగలదనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.