తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై బీబీసీ ఛానల్ ఆసక్తి కనబర్చింది.అనుమతుల సాధన, ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుపుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న బీబీసీ ఇండియా ప్రతినిధులు మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో కలుసుకున్నారు.
న్యూ ట్రెండ్ సెట్ చేస్తున్న మంత్రి హరీష్ రావు ..!
ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి హరీష్ రావు ఇంటర్వ్యూ తీసుకున్నారు. కోటిఎకరాల మాగాణిగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేందుకు సీఎం కేసీఆర్ తలపెట్టిన ఈ ప్రయత్నం… త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని మంత్రి చెప్పారు. యాసంగి పంటకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారాసాగు నీరందిస్తామన్నారు.
మూడు బ్యారేజీలు, పంప్ హౌస్ లు, టన్నెల్స్, గ్రావిటీ కెనాల్, మోటార్ పంపులు, విద్యుత్ సబ్ స్టేషన్లు ఇలా దాదాపు 19 ప్రాజెక్టులు ఏక కాలంలో నిర్మించడం చారిత్రాత్మక అంశమని మంత్రి చెప్పారు.