ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. జగన్ తో పాటు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. టీడీపీ పాలన నచ్చక వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పెనుగొండలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ సమక్షంలో చిన్నంవారి పాలెంకు చెందిన చిన్నం రామిరెడ్డి, వెంకట్రాపురంలకు చెందిన పిల్లి నాగయ్యలతో పాటు పలువురు వైసీపీలో చేరారు. దీంతో పార్టీలో నూతనోత్సహం వెల్లివిరిసింది. బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. జగన్ వారితో సేల్ఫీలు దిగారు.