ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ 180వ రోజు సోమవారం ఉదయం పెనుగొండ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఐతంపుడి, ఏలేటిపాడు, ఒగిడి క్రాస్, గొల్లగుంట పాలెం, వేండ్రవారి పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతంర పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి ఇరగవరం మీదుగా యర్రాయిచెరువు వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. అనంతరం జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు. ప్రజాసమస్యలు తెలుసుకంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పటి వరకు జననేత 2,236 కిలో మీటర్ల దూరం నడిచారు.