రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణమని ఎల్‌ఐసీకి ఇది చాలా మంచిదినమని ఆ సంస్థ చైర్మన్ వీ కే శర్మ అన్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా రైతుబీమాపై ప్రభుత్వం, ఎల్‌ఐసీ మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ మాట్లాడుతూ..భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసిన తాను..ఎక్కడా రైతు జీవిత బీమా వంటి పతకాలు చూడలేదన్నారు.ఇటువంటి పథకాన్ని రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి విజినరీ నాయకుణ్ణి కూడా ఎక్కడా చూడలేదని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన రైతు బంధు అని ప్రశంసించారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎంతో కష్టపడుతున్నారు. సీఎం కేసీఆర్ విజన్ ఉన్న లీడర్. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చాను, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎల్‌ఐసీ రూ. 40 వేల కోట్లు పెట్టుబడులు పెట్టింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తామని వీకే శర్మ స్పష్టం చేశారు.