ఏపీ అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.నిన్న మొన్నటి వరకు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా వీరిజాబితాలోకి అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు పదేళ్ళ పాటు మంత్రిగా పని చేసి ..దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు అత్యంత నమ్మకమైన వాడిగా పేరుగాంచిన మాజీ మంత్రి చేరారు .
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనంరామనారాయణరెడ్డి అధికార తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు.. సోమవారం ఉదయం అయన ” చంద్రబాబుగారూ .. మీకు , మీ పార్టీకి ఒక నమస్కారం ” అని సమాచారం ఇచ్చేసి టీడీపీతో తెగతెంపులు చేసుకున్నారు అని వార్తలు వచ్చాయి .
గత ఆరునెలలుగా అయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీలో చేరిన నాటినుంచి తమను ఇబ్బందిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ఇప్పటికే పలు మార్లు తన ఆవేదనని వ్యక్తం చేశారు భావిస్తున్నారు. టీడీపీలో ఇమడలేక ఇబ్బందిపడుతున్నారు. పార్టీలో బహునాయకత్వం ,వర్గ పోరు సంకటంగాఉందన్నది ఆనం చాలా సార్లు తెలిపారు కూడా ..ఇటివల తన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి కూడా బాబును నమ్మొద్దు ..పార్టీలో ఉండొద్దు.వేరే పార్టీలో చేరమని సలహాలు ఇచ్చినట్లు ..ఆనం కుటుంబం ఎప్పటి నుండో వైసీపీలో చేరుతుంది అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే.తాజాగా ఆనం టీడీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు వస్తున్నా వార్తలు వైసీపీలో చేరికకి బలం చేకూరుస్తుందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..