గతకొన్ని రోజుల నుండి టీ టీ డీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.అయితే ఈ రోజు అయన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి ఆరోగ్య పరీక్షల నిమిత్తం వచ్చారు.ఈ సందర్భంగా అయన పలు సంచలన వాఖ్యలు చేశారు.తన ఆస్తులన్నీ పెద్దల ద్వారానే వచ్చాయని, అందుకు సంబంధించిన నిజమైన పత్రాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పారు . తన సంపాదనలో అక్రమార్జన ఉంటే సీబీఐ విచారణకు సిద్ధమని మీడియా ముఖంగా అయన ప్రకటించారు. తనపై వ్యక్తిగత ఆరోపణలుచేస్తోన్న పాలకులు, అధికారులు వారంతా సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. తప్పు రుజువైతే ఏ శిక్షకైనా వెనుకాడబోనని చెప్పారు.భక్తులకు ప్రవేశం లేని స్వామివారి లోపలి పోటులో తవ్వకాలను తాను ప్రత్యక్షంగా చూశానని ఈ సందర్భంగా తెలిపారు.