గత వారం రోజులనుండి పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ రోజు కూడా తగ్గాయి.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటా ప్రకారం ఈ రోజు లీటరు పెట్రోల్‌పై 15 పైసలు..అదేవిధంగా లీటరు డీజిల్ పై కూడా 14 పైసలు చమురు సంస్థలు తగ్గించాయి.గత వారం రోజులనుండి చూస్తే ఇదే అధికంగా తగ్గించారని చెప్పవచ్చు.దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.11 నుంచి రూ.77.96కు దిగొచ్చింది. డీజిల్ కూడా రూ.68.97గా నమోదైంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.82.59గా, డీజిల్ ధర రూ.74.97గా ఉన్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గుతాయనిఇప్పటికే ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సంకేతాలు ఇచ్చారు. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరగడంతోనే, దేశీయంగా ఇంధన ధరలు పెరిగాయని, ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర 75 డాలర్ల నుంచి 76 డాలర్లకు తగ్గిందని అయన అన్నారు.