యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ తండ్రి అయ్యాడు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఆదివారం రాత్రి పండంటి పాపకు జన్మనిచ్చారని టాక్ వస్తోంది. ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి దంపతులకు ఇప్పటికే అభయ్ అనే కుమారుడున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అభయ్‌కి చెల్లెలు పుట్టిందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ దంపతులకు టాలీవుడ్ పెద్దలు, అభిమానుల నుంచి పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ కుటుంబసభ్యుల నుంచి అధికారిక సమాచారం వెలువడాల్సివుంది.
ఎన్టీఆర్ దంపతులకు నాలుగేళ్ల క్రితం అభయ్ పుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పాప పుట్టిందని.. శిశువు, తల్లి ఆరోగ్యంగా వున్నారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ ప్రణతి కోసం బిగ్ బాస్ షో తెలుగు సీజన్‌ను పక్కనబెట్టేశాడు. దీంతో బిగ్ బాస్ షో కోసం నాని వ్యాఖ్యాతగా మారాడు. బిగ్ బాస్ షో షూటింగ్ హైదరాబాదులో ప్రారంభమైంది.
Tags ntr second delivary Tolly wood wife