ఆరు దశాబ్దాల పోరాటం .మూడున్నర కోట్ల ప్రజల చిరకాల వాంఛ ..ఎన్నో ఉద్యమాలు ..మరెన్నో పోరాటాలు ..వందల మంది ప్రాణత్యాగాలు ..వెరసీ టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ఉద్యమ దళపతి కేసీఆర్ నాయకత్వంలో సరిగ్గా ఇదే నెలలలో నాలుగు యేండ్ల కింద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం .ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు .అధికారాన్ని చేపట్టిన రోజు నుండి నాలుగు ఏండ్లుగా ఎన్నో పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ యావత్తు దేశాన్నే తమవైపు తిప్పుకునేలా పాలిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ .ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ నాలుగు యేండ్ల పాలనపై ఆన్ లైన్ వెబ్ మీడియా చేసిన సర్వేలో
షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి .
ఈ క్రమంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పాలన ఎలా ఉంది అనే అంశం మీద సర్వే చేయడం జరిగింది .ఈ సర్వేలో విద్యార్థుల దగ్గర నుండి నిరుద్యోగ యువత వరకు ..పండు ముసలవ్వ దగ్గర నుండి రైతన్న వరకు ..మహిళల దగ్గర నుండి ఉద్యోగుల వరకు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు .ఈ క్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ తమ కోసం ఎన్నడు లేని విధంగా గురుకులాలు ,సన్నబియ్యంతో భోజనం ,మెస్ ఛార్జీలు పెంచడం బాగున్నాయి అని పేర్కొన్నారు .నిరుద్యోగ యువత ఇప్పటివరకు ఎనబై మూడు నోటిఫికేషన్ల ద్వారా ముప్పై వేల ఉద్యోగాలకు ప్రకటనలిచ్చిన మిగత ఉద్యోగాలను భర్తీ చేయడం త్వరగా జరగాలని కోరుకున్నారు .
అంతే కాకుండా టీఎస్ఐ పాస్ ద్వారా ..టీహబ్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ప్రత్యేక్ష పరోక్ష ఉపాధిని కల్పించడం బాగుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు .ఆసరా పెన్షన్ ద్వారా తమకు అండగా ఉన్నారని బీడీ కార్మికులు ,గీత కార్మికులు ,ముసలవ్వలు ,వికలాంగులు ,ఒంటరి మహిళలు ,వితంతువులు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన బాగుందని తెలిపారు .మిషన్
కాకతీయతో చెరువులను బాగుచేయించడం ..ఉమ్మడి పాలమూరు జిల్లాలో ,ఖమ్మం జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి త్రాగునీరు సాగునీరు అందించడంలో ప్రభుత్వం సఫలమైందని ..గత అరవై యేండ్లతో పోల్చుకుంటే గత నాలుగు ఏండ్లుగా బాగుందని ..అంతే కాకుండా రాష్ట్రం ఏర్పడిన ఏడాదికే ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడం ..ఇటివల
ప్రకటించిన రైతు బంధు పథకం బాగుందని కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు .
ఇక మహిళలు షీటీమ్స్ తో రక్షణ ,కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్ ,కేసీఆర్ కిట్లు ,అమ్మ ఒడి లాంటి పథకాలతో స్త్రీ సంక్షేమ అభివృద్ధి కోసం గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని చేపట్టని పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు .సింగరేణి కార్మికులు మొదలు ప్రభుత్వ ఉద్యోగుల వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు .రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన బాగుందా ..ప్రభుత్వ పథకాలు అందరికి అందుతున్నాయా అనే అంశం మీద అభిప్రాయాన్ని అడగ్గా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగుందని ..ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికి అందుతున్నాయని తొంబై శాతం మంది అన్నారు .
అంతే కాకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ జీవితాలు మారాయని ఎనబై శాతం మంది మారిందని మిగత ఇరవై శాతం మంది గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం పర్వాలేదని వ్యాఖ్యానించడం గమనార్హం .. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికీ ఓట్లు వేస్తారని అడగ్గా ఎనబై శాతం మంది టీఆర్ఎస్ పార్టీకి పది శాతం మంది కాంగ్రెస్ పార్టీకి ..ఐదు శాతం మంది బీజేపీ,టీడీపీ పార్టీకి ..ఐదు శాతం మంది ఎవరికి వేయమని తటస్థమని పేర్కొన్నారు .సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మరల టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయం అన్నమాట ..