2017-18 సంవత్సరంలో 10.4 శాతం తెలంగాణ పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగిందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మహానగరంలోని పార్క్ హోటల్‌లో 2017 – 18 తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య వార్షిక నివేదికను సోమవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
IT & Industries Minister @KTRTRS addressing the gathering at the release of Industries Dept Annual Report 2017-2018 in Hyderabad. pic.twitter.com/ewDHSZXDyS
— Min IT, Telangana (@MinIT_Telangana) June 4, 2018
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1,23,478 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు . పెట్టుబడుల ద్వారా 5 లక్షల 27 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 55 శాతం అధికంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. పలువురు పారిశ్రామికవేత్తలు, ఉత్తమ కంపెనీలకు పారిశ్రామిక అవార్డులను కేటీఆర్ అందజేశారు.