రాష్ట్రంలోని రైతులందరికీ జీవిత బీమా కోసం ఎల్ఐసీ సంస్థతో ఒప్పందం చేసుకోవడం నా జీవితంలో నేను చేసిన గొప్ప అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. HICCలో జరిగిన రైతుబంధు జీవిత బీమా పథకం అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, రైతు సమన్వయ సమితుల జిల్లా, మండల సమన్వయకర్తలు హాజరయ్యారు. సదస్సులో ప్రభుత్వం రైతుబంధు జీవిత బీమా పథకానికి సంబంధించి LICతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం సమక్షంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి, ఎల్ఐసీ ఛైర్మన్ వీకే శర్మ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడారు సీఎం కేసీఆర్. రైతు జీవిత బీమా మంచి పథకమని…ఇది ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుందన్నారు. 18 నుంచి 60 ఏళ్ల రైతులు ఏ కారణంగా చనిపోయినా బీమా వర్తిస్తుందన్నారు. ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే..కేవలం పది రోజుల్లో ఆ కుటుంబ సభ్యులకు బీమా డబ్బులు వస్తాయన్నారు.
పోచారం మంత్రి పదవిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రైతులకు మంచి కార్యక్రమాలు అమలు అవుతున్నాయన్నారు. తెలంగాణ రైతుల తరపున ఎల్ఐసీకి కృజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ అన్నారు. నమ్మకమున్న సంస్థ కాబట్టే రైతు బీమా LICకి అప్పగించామన్నారు.
రైతులను ఆదుకోవడం కోసమే రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులు ఉన్నారన్నారని…రైతుబంధుతో 89 శాతం రైతులు సంతోషంగా ఉన్నారన్నరని తెలిపారు. ఇది తాను చెప్పిన మాట కాదని పేపర్లే రాశాయన్నారు. రైతుబంధు పథకంలో అధిక ఆదాయం ఉన్నవాళ్లను డబ్బులు తీసుకోవద్దని కోరానని తెలిపారు. రైతుబంధు పథకంలో తనతో పాటు చాలా మంది డబ్బులు తీసుకోలేదన్నారు.
అయితే రైతు బీమా తాను తీసుకుంటానని… ఖచ్చితంగా అందరూ తీసుకోవాలన్నారు సీఎం. బీమాతో రైతు మరణిస్తే ధీమా అన్నారు. బీమా పథకాన్ని అందరూ ఉపయోగించుకోవాలన్నారు. బీమా పథకం అమల్లో AEO కీలక పాత్ర వహించాలని.. రైతులకు పేపర్లను అందించడంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పేపర్ల లో రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉండేలా AEO చూడాలన్నారు. రైతుకు సంబంధించిన పూర్తి పేరుతో పాటు..సెల్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఉండేలా చూడాలన్నారు. అంతే కాదు నామిని వివరాలను రైతులు చెప్పిన ప్రకారమే నింపాలన్నారు.
రైతుకు కులం లేదు…ఎవరికి భూమికి ఉంటే వారే రైతు అన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతు చల్లగా ఉండాలన్నారు. రైతు క్షేమంగాఉంటేనేదేశం అభివృద్ధి చెందుతుందన్నారు. రైతు పెట్టుబడి కోసం వెతుక్కునే పరిస్థితి రావొద్దన్నారు. నాణ్యమైన కరెంటు…కడుపునిండా నీళ్లు, మద్దతు ధర ఉంటే రైతులకు ఎలాంటి కష్టాలు రావన్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణలో ఇక జనరేటర్ల అవసరం లేదన్నారు. రాష్ట్రంలో రెప్పపాటు కాలం కూడా విద్యుత్ కోత ఉండదన్నారు. కాళేశ్వరం పూర్తయితే రోహిణికి ముందే నాట్లు వేసుకుంటారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపుతున్నామన్నారు. భవిష్యత్లో 365 రోజులూ చెరువులు నీళ్లతో కళకళలాడుతాయన్నారు.