ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు కొనసాగుతుంది. అక్కడ అక్కడ టీడీపీ నుండి వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా అనంతపురం కు చెందిన మాజీ కార్పొరేటర్, ఏపీ నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ మాజీ చైర్మన్ గురు శేఖర్‌బాబు వైసీపీలో శనివారం చేరారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి శేఖర్‌బాబును ఆహ్వానించారు.
అనంతరం శేఖర్‌బాబు జగన్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయన వెంట పెద్దన్న, నంద, ఆది, నారాయణ, నాగేంద్ర, రమేష్, రాము ఉన్నారు. కాగా శేఖర్‌బాబు సతీమణి గురు బిందుప్రియ గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 50వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందారు. త్వరలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఈమె కూడా వైసీపీలో చేరనున్నారు.