ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ ఆదివారం ఉదయం జగన్నాధపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మార్టేరు, వెలగలేరు క్రాస్, సత్యవరం క్రాస్, నెగ్గిపూడి చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.
వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన.. అనంతపురం నేతలు
అనంతంర పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. పెనుగొండ చేరుకుని అక్కడ ప్రజలతో వైఎస్ జగన్ మమేకంకానున్నారు. పెనుగొండ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. అనంతరం జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు. ప్రజాసమస్యలు తెలుసుకంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.