హీరో విశాల్ పేరు ఇప్పుడు అభిమన్యుడు సినిమాతో మారుమోగిపోతోంది. విభిన్నమైన కథాంశాలు. విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడంతో విశాల్ ఇప్పుడు వరుస హిట్స్ కొడుతున్నారు. పందెం కోడి నుంచి గత చిత్రం వరకు సినిమాలపట్ల విశాల్‌కు ఉన్న అభిరుచిని తెలియజేశాయి. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా విశాల్ నటించిన చిత్రం అభిమన్యుడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంత, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు పోషించారు. జూన్ 1 శుక్రవారం ఈ చిత్రం తెలుగులో విడుదలైంది. తమిళంలో లానే తెలుగులో కూడా అభిమన్యుడు హిట్ అయింది. ఈ సందర్భంగా మంచు విష్ణు విశాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి స్పందించిన విశాల్ ధన్యవాదాలు సోదరా.. విజయం నాది కాదు.. మీ నాన్న మోహన్‌బాబుదే.. నేను నటుడ్ని అవుతానని మా నాన్నతో చెప్పిన వ్యక్తి మోహన్‌బాబే అని పేర్కొన్నాడు.