ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నిఫా వైరస్ కలకలం సృష్టించింది. కేరళ రాష్ట్రం నుంచి తిరుపతికి వచ్చిన ఓ మహిళా వైద్యురాలికి ఈ వైరస్ ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని రుయా ఆస్పత్రిలో ఆ వైద్యురాలికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రాణాంతక ‘నిపా’ వైరస్ దేశంలో మొదటిసారిగా కేరళలో బయటపడింది. ఇప్పటి వరకూ ‘నిపా’ బారిన పడి కేరళలో మరణించిన వారి సంఖ్య 16కు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో డాక్టర్ లు అప్రమత్తంమయ్యారు.
