సినీనటుడు మంచు మనోజ్ ఓ పబ్బులో అర్ధరాత్రి హల్‌చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో జనరల్ డైరీ(జీడీ)లో మాత్రమే నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 45లోని ఫ్యాట్ పీజియన్ పబ్‌కు గత నెల 22న మంచు మనోజ్ వెళ్లారు. రాత్రి 11.30 గంటలు కావడంతో పబ్ నిర్వాహకులు డీజే సౌండ్ తగ్గించారు. దీంతో ఆగ్రహించిన మనోజ్ శబ్దం పెంచాలంటూ డీజేను, స్పీకర్లు పగులగొట్టారు. విషయం తెలిసి జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకోగా.. ‘తాను ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేయగా పబ్‌లో డీజే మోత ఎక్కువగా ఉందని, తగ్గించాలని సూచించానని’ మనోజ్ పోలీసులకు చెప్పారు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజీనంతా పబ్ నిర్వాహకులు పోలీసులకు అందించారు. ఫిర్యాదు చేయడానికి పబ్ నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో కేసు నమోదు కాలేదని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.
