టాలీవుడ్ చందమామ కాజల్ టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభవించింది. బాలీవుడ్‌లో సైతం పలు చిత్రాలతో సక్సెస్‌ను అందుకుంది. కానీ, బాలీవుడ్‌లో కాజల్ కోరుకున్నంత స్టార్‌డమ్ మాత్రం రాలేదు. ఇడస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటుతుంది. ఈ లాంగ్ జర్నీలో కాజల్ అగర్వాల్ కోరిక మాత్రం తీరలేదని, దీంతో తాను కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయని నిట్టూర్చుతోంది కాజల్.
అసలు అలాంటి కోరికలు నెరవేరితే ఎంత బాగుండు అని, కానీ, ఎందుకోకాని, ఆ కోరికలు తీరడం లేదంటూ ఈ బ్యూటీ తెగ బాధపడిపోతోంది. కాజల్ అగర్వాల్‌కు లేడీ ఒరియంటెడ్ చిత్రం చేయాలని ఉందట. అవి కూడా అల్లాటపపా మూవీస్ కాదట. లేడీ బ్రూస్లీ టైప్‌లో.. విలన్లను చిత్తుచేసే విధంగా క్యారెక్టర్ ఉండాలని కాజల్ అగర్వాల్ కోరుకుంటుంది. అయితే, తాను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్నా.. అలాంటి కథలతో ఏ దర్శకుడు తన వద్దకు రాలేదని, అందుకే తన కోరిక కలలానే మిగిలిపోతుందన్న భయం పట్టుకుందని కాజల్ తెగ బాధపడిపోతోంది.