తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి.ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్ శ్రేణులు ,తన్నీరు అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు .
రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ,ప్రాజెక్టుల దగ్గర టీఆర్ ఎస్ శ్రేణులు ,తన్నీరు అభిమానులు కేకులు కట్ చేసి ..అన్నదానాలు ,రక్తదానాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు .ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏరోళ్ల శ్రీనివాస్ ,టీఆరెస్వీ సీనియర్ నాయకుడు సంతోష్ రెడ్డి సమక్షంలో వేలాది మంది అభిమానుల ,గులాబీ శ్రేణుల సాక్షిగా మంత్రి హరీష్ రావు కేకు కట్ చేశారు .
ఇదే క్రమంలో ఒక దివ్యాంగురాలు మంత్రిని కలిసేందు వచ్చి, జన సందోహం కారణంగా కలవలేకపోయింది. అదే సమయంలో దుబ్బాకలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కారెక్కిన మంత్రి హరీష్ రావుకు ఈ విషయం తెలియడంతో కారు దిగి వచ్చి ఆమెను పలుకరించారు.ఆ దివ్యాంగురాలుతన సమస్య విన్నవించడంతో తప్పక సాయంచేస్తానని హమీ ఇచ్చారు. ఎంతో దూరం నుంచి వచ్చిన తమను మంత్రి పలుకరించి, ఆప్యాయంగా మాట్లాడిన తీరు పట్ల వారు ఆనందభరితులయ్యారు అందరూ .