తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అభిరుచి ఉన్న వ్యక్తుల్లో ప్రముఖ దర్శకుడు క్రిష్ ఒకరు. అయితే, అతని వ్యక్తిగత జీవితం ప్రస్తుతం కుదుపులకు లోనైనట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుల్లో ఒకరైన క్రిష్ తన భార్య రమ్య నుంచి విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే క్రిష్ ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారట. అప్పట్లో క్రిష్ పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అసలు పెళ్లి పత్రికతోనే తన స్టేటస్ ఏంటో చెప్పాడు క్రిష్.
క్రిష్ సినీ లైఫ్ ఎంతో సంతోషంగా ఉండేది. అటు డాక్టర్‌గా రమ్య జీవితం కూడా అలాగే ఉండేది. దాంతో తమ తమ రంగాలు పూర్తిగా డిఫరెంట్ అని కలిసి కాపురం చేయడం కుదరదని తెలుసుకుని విడాకులు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, క్రిష్ విడాకులకు అసలు కారణం వేరే ఉన్నట్టు తెలుస్తోంది. క్రిష్ గత కొలంగా ఓ ఉత్తరాది భామతో డేటింగ్ చేస్తున్నాడని, క్రిష్ తెరకెక్కించిన మూవీలో ఆమె హీరోయిన్ అని తెలుస్తోంది. అయితే, పెళ్లైన తరువాత కూడా క్రిష్ ఆమెతో అనుబంధం కొనసాగించడం రమ్యకు నచ్చలేదని ఈ కారణంగానే ఇద్దరి మధ్య గొడవలు వచ్చినట్టు సమాచారం. ఇక క్రిష్‌తో కలిసి జీవించడం కష్టమని భావించిన రమ్య విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.