ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రజాధరణ లేకుండా చేస్తోన్న కార్యక్రమం నవనిర్మాణ దీక్షలు.. అయితే అందరూ అనుకొంటున్నట్లు ఈ నవనిర్మాణదీక్షలు 2,లేదా 3 రోజులుకాదు , మొత్తం 10 రోజులు. అయితే దీనికి పెడుతున్న మొత్తం ఖర్చు మొత్తం అక్షరాలా 130 కోట్లు . ఖాళీ కుర్చీలతో నవనిర్మాణ దీక్ష పేరుతొ చేసే ప్రతిజ్ఞకి అయ్యే ఖర్చు అక్షరాలా నిన్న ఒక్కరోజుకే 13 కోట్ల 10 లక్షలు. ఈ 10 రోజులు ప్రతిజిల్లాలో జిల్లా యంత్రాంగం అంతా ఇదే పనిలో నిమగ్నమై ఉండబోతున్నారు . ప్రతిరోజూ డ్వాక్రామహిళలని , స్కూల్ పిల్లలని , ఇంకా డబ్బులిచ్చి మరీ మిగతా ప్రజలని సమీకరించి ఈ కార్యక్రమం చేస్తున్నారు . దీనికోసం రాష్ట్రం నుండి వెలువడుతున్న అన్ని పత్రికలకి అడ్వర్టైజ్ మెంట్ రూపంలో భారీగా నిదులు విడుదల చేసినట్టు తెలుస్తుంది .ప్రతిరోజు అన్నీ దినపత్రికలలో ఇంగ్లీష్ తో సహా ఫుల్ పేజీ యాడ్స్ వచ్చేవిధంగా ప్లాన్ చేసుకుంటున్నారంట.
అసలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏమిటో ఈ ఖర్చు ఏమిటో , ఈ ప్రచారం ఏమిటో ఎవ్వరికీ అంతుపట్టకుండా ఉంది. ప్రజా సంక్షేమం లేదు. ప్రజలకు ఉపయోగపడే కార్య్రక్రమాలు లేవు. అన్నీ సెట్టింగులు.. ఈవెంట్లే.. తన అనుభవం మొత్తం రంగరించి ప్రచారం పేరుతో దోపిడీ చేస్తున్నారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. చంద్రబాబు చేస్తోన్న ఈ దీక్షలు ఎవరికోసం , ఇది ఏమైనా ప్రజలకి ఉపయోగపడే పనేనా ? కనీసం ఈ డబ్బులతో కరువుజిల్లాలో తిండికి లేక వలసపోతున్న ప్రజలకి అన్నదానం , పశువులకు గ్రాసం ఏర్పాటు చేసినా బాగుండేదంటూ రైతులు వాపోతున్నారు. టీపిడీ దోపిడీ సర్వం దోపిడీ – . దానికోసం ఇచ్చిన జీవోని మీరే చూడండి..G.O.RT.No.260 Date : 29-05-2018
గడచిన నాలుగేళ్లుగా ఇదే తంతు. ఏపీ ప్రజలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి.. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సంపదని మొత్తం దోచుకుంటున్న ఈ అవినీతి ,దగాకోరు ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించండి అంటూ వైసీపీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు.