ఏపీలో టీడీపీ, బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం వల్లనే చంద్ర బాబు 2014 లో ముఖ్యమంత్రి అయ్యి అధికారం లోకి వచ్చాడు అన్న సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే అప్పుడు కానీ టీడీపీ ఒంటరిగిగా బరిలో దిగి ఉంటె టీడీపీ కి 50-56 సీట్లు వచ్చేవి అని కొందరు ఆరోపిస్తున్నారు. అంతేగాక అమలుకాని 600 అపద్దపు హామీలు ఇచ్చాడు ఇది ఒక కారణం అంటున్నారు. కాని ఇప్పుడు ప్రజలు అందరికి తెలిసిపోయింది. అందుకే టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత వచ్చింది. గడిచి న 4 ఏళ్లు ఏ ఒక్కరికి న్యాయం చేయకపోగ ..అత్యతం దారుణంగా మహిళలపై దాడులు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇటువంటి పాలనపై వచ్చే ఎన్నికల్లో ప్రజాబలం ఎలా ఉందని ఏన్నో జాతీయ సర్వేలు చేశాయి. ఒక్కటి కూడ టీడీపీ కి అనుకూలంగా ఇవ్వలేదు..ఆఖరికి టీడీపీ సర్వేలు కూడ ప్రధాన ప్రతి పక్షం అయిన వైసీపీ గెలుస్తుందని బల్లగుద్ది చెప్పాయి. తాజాగా మరో జాతీయ సర్వే వైసీపీ కి 150 సీట్లు… టీడీపీ కి 20 సీట్లు…మిగత ఇతర పార్టీలకు 4 అని తెల్చాయి. ఈ సర్వేతో వైసీపీ అభిమానుల్లో మరింత రెట్టింపు ఉత్సాహం పెరిగింది.
