గత ఎడాది నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు అలుపనేది లేకుండ ..నిరంతరం ప్రజా సమస్యల కోసం ఏపీ ప్రతి పక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతి రోజు జగన్ తోపాటు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. అంతేగాక టీడీపీ, కాంగ్రెస్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాదయాత్ర మొదలు ఇప్పటి వరకు భారీగా వైసీపీలోకి వలసలు వస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన సుమారు 30 మంది ముస్లిం యువకులు వైసీపీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పట్టణానికి పాదయాత్రగా వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వీరు పార్టీలో చేరారు. పార్టీ నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకుని పార్టీలో చేరుతున్నామని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో ఎండీ షరీఫ్, ఎండీ ఆదిల్, ఎండీ ఖాదిల్, ఎండీ రౌఫ్, ఎండీ నూరిళ్ల, అబ్దుల్ రఫీ తదితరులు ఉన్నారు. ఎండీ భాషాఖాన్ నేతృత్వంలో వీరు పార్టీలో చేరారు.
