వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే 2200 పై చిలుకు కిలో మీటర్లు నడిచిన జగన్ తన పాదయాత్రను పూర్తి చేశారు. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుంటున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు అయితే తమకు పింఛన్ రావడం లేదని, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో చంద్రబాబు సర్కార్ అక్రమాలకు పాల్పడుతుందంటూ నిరుద్యోగులు, తమకు రుణమాఫీ కాలేదంటూ రైతులు, డ్వాక్రా మహిళలు జగన్‌కు చెప్పుకుంటున్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిపై వైరల్ న్యూస్..!!
ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో జగన్ పాదయాత్రలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు పాల్గొన్న విషయం తెలిసిందే. పోసాని కృష్ణ మురళీ, పృథ్వీ రాజ్ ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన జగన్ అడుగులో అడుగు వేస్తూ వెంట నడిచారు. అంతేకాకుండా, గతంలో అక్కినేని నాగార్జున, యువ హీరో అఖిల్, కోలీవుడ్ హీరో సూర్య, దివంగత నిర్మాత, దర్శకుడు, నటుడు దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్, హీరో సుమంత్ తదితరులు జగన్ పాదయాత్రపై స్పందించి తమ అభిప్రాయాన్ని మీడియా వేదికగా పంచుకున్నారు. రెండు కిలోమీటర్లు నడవడమంటేనే కష్టం.. అటువంటిది ప్రజల కోసం మూడే వేల కిలోమీటర్లు నడిచేందుకు జగన్ సాహసించడం అద్భుతమన్నారు.
జగన్‌పై తమ అభిమానాన్ని చాటుకున్న వారిలో తాగాజా మంచు విష్ణు కూడా చేరిపోయాడు. కాగా, మంచు విష్ణు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తనకు వరుసకు బావ అవుతారని, అయితే, తాను జగన్‌ను అన్న అనే పిలుస్తానని చెప్పారు. జగన్ మంచి మనస్సు ఉన్న వ్యక్తి అని చెప్పారు. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదాపై పట్టువిడవని విక్రమార్కుడిలా పోరాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమేనని తన మనసులోని మీడియాతో పంచుకున్నారు మంచు విష్ణు.