ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా 177 రోజులు అలాగే, 2వేల 200 పైచిలుకు కిలోమీటర్లు నడిచారు. జగన్ ఏ ప్రాంతంలో పాదయాత్ర చేసినా ఆ ప్రాంత ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇలా ప్రజల సమస్యలపై పోరాడుతూ.. ప్రత్యేక హోదాపై జగన్ చేస్తున్న పోరాటానికి ప్రజలతోపాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే, ఇటీవల కాలంలో సినీ రంగానికి చెందిన సూపర్ స్టార్ కృష్ణ, అక్కినేని నాగార్జున, పోసాని మురళీ కృష్ణ, పథ్వీ రాజ్, దాసరి అరుణ్, సుమంత్, అఖిల్ ఇలా చాలామంది యువ హీరోలు జగన్‌కు మద్దతు పలికిన విషయం తెలిసిందే. అయితే, హీరో మంచు విష్ణు కూడా జగన్‌కు మద్దతు పలికిన వారి లిస్టులో చేరిపోయారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన విష్ణు.. జగన్ తనకు వరుసగా బావ అవుతాడని, అయినా నేను జగన్‌ను అన్న అనే పిలుస్తానంటూ చెప్పుకొచ్చాడు. జగన్ మంచి మనస్సు ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి ప్రజల ఆదరణ బాగా ఉంటుందని విష్ణు అన్నారు.