తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది . పట్నం నుంచి గ్రామాలకు.. పల్లె నుంచి దూ ప్రాంతాలకు వెళ్లేవారి కోసం కొత్త గా లింక్ టికెట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ను ఈ రోజు ( శనివారం జూన్-2) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు .
ఈ లింక్ టికెట్ తో ఒక ప్రయాణికుడు రిజర్వేషన్ సౌకర్యం ఉన్న ప్రాంతం వరకు రిజర్వ్ చేసుకుంటే… గ్రామీణ ప్రాంతంలోని గ్రామం, మండల కేంద్రానికి అదే టికెట్ పై ప్రయాణం సాగించవచ్చు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు లింక్ టికెట్‌ను రిజర్వ్ చేసుకుని అక్కడికి చేరుకున్నాక… తిరిగి వరంగల్ నుంచి ఏదేనీ గ్రామానికి ఇతర బస్సుల్లో వెళ్లాలంటే ఇదే టికెట్ పని చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల ప్రయాణానికి నామమాత్రపు చార్జీలను వసూలు చేస్తారు. ఈ ఆఫర్ తో మామాలు టికెట్ కంటే 10 శాతం ధర తగ్గుతుందని, సమయం కలిసొస్తుందని ఆర్టీసీ సంస్థ తెలిపింది .