తెలంగాణ ఒక నూతన రాష్ట్రం ఎన్నో పోరాటాల అనంతరం తెలంగాణ ఏర్పాటైంది.పోరాడి సాదించుకున్న రాష్ట్రంలో ప్రజలకు అవసరాలేంటో,ఆశలేంటో,ఆకాంక్షలేంటో తెలిసిన నాయకుడు నాయకత్వం అవసరం.అందుకు అనుగుణంగానే తెలంగాణ సామాజిక,బౌగోళిక,ఆర్థిక పరిస్థితులపై సుదీర్గ అవగాహన,మంచి పట్టు కలిగిన నాయకుడు కేసీఆర్ రూపంలో ముఖ్యమంత్రి గా ప్రజలు ఎన్నుకున్నారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన మొదలెట్టాడు ముఖ్యమంత్రి కేసీఆర్.పరిపాలనా ఆరంభంలోనే సమగ్రంగా రాష్ట్రంలోని అన్ని అంశాలపై సమగ్ర కుటుంబ సర్వేతో ప్రజల స్థితిగతులపై పూర్తి స్థాయిలో అద్యయనం చేసాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్..
ప్రజల సామాజిక,ఆర్థిక పరిస్థితులు తెలంగాణలో దారిద్రరేఖకు దిగువనే ఉన్నాయి. 60ఏండ్లుగా రాష్ట్రాన్ని పాలించిన పాలకులు తమ గురించి డప్ప ప్రజలగురించి ఆలోచించిన పాపాన పోలేదు.ప్రజల సమస్యలను పట్టించుకున్నవారే కరువై వారి ఆకాంక్షలు నెరవేరలేదు.ప్రజల ఆర్థిక స్థితిగతులు మరింత దిగజారి వారి బ్రతుకులు ఆగమ్యగోచరంగా మారాయి.కులవృత్తులు కనుమరుగు చేసారు గతపాలకులు,కుల వృత్తికి ఆదరణలేక వలసబాట పట్టారు ప్రజలు,కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.తెలంగాణా ఏర్పాటుతో కష్టాలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి గా ఉండటంతో నాలుగేళ్ళలో తెలంగాణా సంక్షేమ రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది.ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నిండాయి.వారికి ఈ నాలుగేళ్ళలో పలు పథకాలతో అండగా నిలిచింది తెలంగాణ సర్కార్..
ఎన్నికల మేనిఫేస్టోలో లేని అంశాలను,ఎవరు తనను అడక్కున్నా వాటి అవసరం తానే గ్రహించి ప్రజలకు అందజేసారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.కళ్యాణలక్ష్మి పథకం ప్రతీ పేదింటి గడపలో కన్నీరును తుడిచింది.మేనమామ బోళ్ళు పెట్టడం ఆనవాయితీ ఐతే ఇక్కడ మేన మామ కేసీఆర్ గారి రూపంలో ప్రతీ పేదింటికి కళ్యాణలక్ష్మీ సాయం అందిచారు.ఆడభిడ్డలు అతన్ని సొంత అన్నగా కీర్తిస్తున్నరు నేడు అంటే అతిశయోక్తి కాదు.నిరాదరణకు గురవుతున్న వృద్యాప్యానికి ”ఆసరా”గా నిలిచి పేద ముసలవ్వల పెద్దదిక్కైంది సర్కార్.కన్న కొడుకే కనికరం చూపని నేటి రోజుల్లో ఈ ఆసరా పెన్షన్ల పథకం వారికి పెద్దదిక్కైంది.తెలంగాణా ప్రభుత్వం.ప్రవేషపెడుతున్న సంక్షేమ పథకాలు ఒక నూతన ఒరవడిని సృష్టించాయి.ఒకానొక సమయంలో ప్రతిపక్షాలు సైతం మనసులో బేష్ అనుకుంటున్నాయి.
ముఖ్యమంత్రి గారు చేసిన గొప్ప ఆలోచన కేసీఆర్ కిట్ ,అమ్మ ఒడి కార్యక్రమం ఇది నిజంగా దేశమే ఆదర్శంగా తీసుకోవాల్సిన కార్యక్రమం.ఆడభిడ్డ గర్బవతి అయి ఇంటికొస్తే అప్పటికె పెళ్ళిచేసి బారంగా ఉన్న తల్లిదండ్రులు సహకరించని వారి ఆర్థిక పరిస్థితులతో ఆసుపత్రి కి డబ్బులు లేక చాలా ఇబ్బందులకు గురయ్యే వారు.కానీ ప్రభుత్వం ఆడభిడ్డ గర్బం దాల్చిన నుండి తను ప్రసవించి భిడ్డకు మూడు నెలల వయసు వచ్చేంత వరకు వారికి కావాల్సిన ఆర్థికసాయం మగపిల్లాడైతే 12000రూపాయలు ఆడపిల్ల ఐతే 13000రూపాయలు అందజేయడంతో పాటు కేసీఆర్ కిట్ రుపంలో 14వస్తువులను అందజేస్తుంది సర్కార్..ఇది దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.ఇంత గొప్ప ఆలోచన తమకెందుకు రాలేదు అని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు అనుకుంటున్నాయి.కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మన పథకాలను అనుసరిస్తున్నాయి.
మరుగున పడుతున్న కులవృత్తులకు జీవం పోసింది తెలంగాణ సర్కార్.రాష్ట్రంలో క్షిర విప్లవాన్ని తీసుకొచ్చింది,నిరాదరణకుగురైన యాదవ&కురుమలకు గొర్రెల పంపిణీ చేసి వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటునందించింది.ముదిరాజులకు చేపల పంపిణి తో వారి ఆర్థిక స్థితిగతులను మార్చారు కేసీఆర్ గారు.చెరువులపై ఎన్నో కుల వృత్తులు ఆదారపడి ఉన్నాయి.ఆ చెరువును కాపాడటం కోసం మిషన్ కాకతీయను చేపట్టి దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంది తెలంగాణా ప్రభుత్వం,చెరువుల పూటికతీత ఒక గొప్ప కార్యక్రమం చెరువులే గ్రామీణ జలసిరులు,చెరువుపై ఆదారపడి అనేక మంది జీవనం సాగిస్తారు ఈ పూటికతీతద్వారా అనేక వృత్తులకు జీవం పోసింది తెలంగాణా ప్రభుత్వం…
మనసుంటే మార్గం ఉంటుంది.మనసున్న మనిషి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన స్వరాష్ట్ర పోరాటంలో తెలంగాణా అనువనువూ తిరిగి సమస్యలపై ,ప్రజల అవసరాలపై సుదీర్గ అద్యయణం చేసారు.తెలంగాణాలోని ప్రతీ సమస్యపై ఆయన పూర్తిస్థాయి అవగాహణ ఉంది.ఆయన ఉద్యమకాలంలో ఎక్కువగా ప్రజల మద్య,వారి సమస్యల మూలాల్లోకెల్లి అద్యయనం చేసారు.అప్పటి పాలకులకు ఆ సమస్యలు చెప్పినా వారు పట్టించుకోలేదు.కానీ నేడు ఆయనే ముఖ్యమంత్రగా ఉండటంతో దేశం గర్వించదగ్గ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు.
నాయకుడంటే ప్రజలు అడిగితేనే చేసేవాడు కాదు.ప్రజల అవసరాలను గ్రహించి వారికి ఏంచేస్తే మేలు ఆ దిశగా అడుగులేసే వాడు నిజమైన నాయకుడు.కేసీఆర్ ఆ కోవకే చెందుతాడు.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో తెలంగాణ కీర్తి నలుదిశలా వ్యాప్తి చెందింది.తెలంగాణకు పాలన రాదు అన్నవాళ్ళే నేడు తెలంగాణా పాలన బేష్ అంటున్నారు.తెలంగాణ వస్తే చీకట్లలో మగ్గుతారు అన్నవారే నేడు చీకట్లలో మగ్గుతున్నారు కానీ తెలంగాణా కోటి కాంతుల్లో వెలుగుతుంది.దేశమే బేష్ అనేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టుకుంటున్నాం,దేశం గర్వించేలా మిషన్ భగీరదతో ఇంటింటికి నల్లా కలెక్షన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణా సంక్షేమం గురించి చెప్పాలంటే ఒక రెండురోజుల సమయం పడుతుంది.
అన్నీటిని మించి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విదంగా ఒక సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించే కార్యక్రమం ”రైతుబందు” రైతుకు పంట పెట్టుబడి సాయం తో పాటు 500000రూపాయల ఇన్సురెన్స్ కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.జాతీయ పార్టీలు సైతం ఈ నిర్ణయాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యాయి.రైతు బందు కార్యక్రమంతో దేశం రైతాంగం తెలంగాణా వైపు చూస్తుంది.తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల కోసం చేపడుతున్న కార్యక్రమాలను చూసి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది.ఈ పథకం దేశ వ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్ బలపడుతుంది.రైతు నినాదానికి తీసుకొచ్చిన కేసీఆర్ గారే దేశవ్యాప్త రైతులకు అండగా ఉండాలనే డిమాండ్ పెరుగుతుంది.
70ఏండ్ల పరిపాలనలో ఏ ఒక్క ప్రభుత్వాలకు సంక్షేమంపై కానీ,రైతుల కోసం కానీ ఇంత గొప్ప ఆలోచన ఎందుకురాలేదు.దేశ గర్వించే విదంగా నేడు తెలంగాణా నిలిచింది.నూతన రాష్ట్రం ఎన్నో చిక్కుముడులను విప్పుకుంటూ తన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసుకుంది తెలంగాణా. ఒక నవ సంక్షేమశకాన్ని సృష్టించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.ముమ్మాటికి దేశంలో కేసీఆర్ నాయకత్వం వస్తే ఇంతకు మించిన సంక్షేమం దేశ ప్రజలకు అందుతుంది.ఆయన నాయకత్వంలోనే దేశం ప్రజల ఆర్థిక స్థితిగతులు,జీవనపరిణామాల్లో మార్పులు సాద్యం..సంక్షేమ రధసారది,సాగుకు పరమావది కేసీఆర్…
- Telangana Vijay