ఇది నాలుగేళ్ల పాలనకాదు, రాష్ట్రసాధన ఉద్యమం కన్న కలలు ఫలిస్తున్న చారిత్రక సందర్భమిది. అసువులు బాసిన అమరుల ఆశయసాధన కోసం కొనసాగుతున్న పునరంకిత పునర్మిర్మాణమిది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గెలిపించేందుకు శ్రమిస్తున్న కేసీఆర్ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం తయారు చేసుకున్న కొత్త ఫార్మెట్‌తో, కొంగొత్త ఆలోచనలతో నూటికి నూరుపాళ్లు ఆచరణలో ముందుకు సాగుతుంది. ఉద్యమకాలంలో చెప్పినవన్నీ చేస్తున్న పనిగా ఈ నాలుగేళ్ల పాలననూ చూడాలి. చెప్పిన పనులు చేయటమే తమ ఆచరణకు గీటురాయి అని ఏ పాలకులైనా చెప్పుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం చెప్పినవి మాత్రమే కాకుండా చెప్పనివి కూడా చేసి చూపిస్తుంది. అదీ కేసీఆర్ పాలన. రాష్ట్రం తనకు తాను పునర్నిర్మాణం చేసుకుంటున్నప్పుడు పాలకుడిగా, గెలిచిన ఉద్యమకారునిగా కేసీఆర్ పునరంకితమై పాలనను అందిస్తున్నారు. దేశమే ఆశ్చర్యంగా తెలంగాణ వైపు చూడటానికి కారణం అదే! చేస్తున్న పనులను, జరుగుతున్న మార్పులను కూడా ఒప్పుకోని వారిని మినహాయించి చూస్తే ఇపుడు సర్వతెలంగాణం అభివృద్ధివైపు ముందుకు సాగుతుంది.
సరిగ్గా తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తొలితెలంగాణ పాలనాపగ్గాలు చేపట్టిన కేసీఆర్ కొత్త అభివృద్ధి నమూనాకు రూపకల్పన చేశారు. ప్రతిరంగాన్ని పునఃసమీక్షిస్తూ పోయారు. నాలుగేళ్లుగా ప్రతిరంగాన్ని క్షుణ్ణంగా చర్చిస్తూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలను రూపొందిస్తూ ముందుకుసాగుతున్నారు. పాత పాకుడు పట్టిన రొట్టకొట్టుడు విధానాలను చెక్కివేయటం మొదలైంది. కేసీఆర్ నాలుగేళ్లలో అన్ని రంగాల్లో పాకుడుబట్టినపూడికను తొలగించివేశారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అన్నిరంగాల్లో శిసెత్తుకుని నిలిచేందుకు విద్యారంగం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక దారివేస్తూపోతుంది. సంక్షేమ రంగాల ద్వారా బహుజనులను ఆదుకోవటం, వారిని నిలబెట్టే పని మొదలైంది. ప్రజాస్వామ్యం పకడ్భందీగా ఉంది. అల్పసంఖ్యాక బహుజన వర్గాలకు, మైనార్టీలకు దేశంలో ఎక్కడాలేని విధంగా సంపూర్ణ రక్షణ ఉంది. దీనికి కర్త, కర్మ, క్రియ కేసీఆర్. అవును ఇది కేసీఆర్ శకం.
ఇది కేసీఆర్ పాలనాశకం. చారిత్రాత్మకమైన భూమికను పోషిస్తున్న ఈ పాలన రోటిన్‌గా కొనసాగేపాలన కాదని, ఇది జాతికి పునరంకితమై కింది స్థాయి నుంచి జరుగుతున్న అభివృద్ధి నమూనగా నిలుస్తుంది. ముమ్మాటికీ కేసీఆర్ శకం అనటానికి కారణం పాలనను పునర్నిర్మాణంగా చేసుకుని పునరంకితమై పనిచేస్తున్న కాలమిది. లెక్కలు కట్టుకుని చూస్తే ఇది నాలుగేళ్ల పాలన మాత్రమే కానీ 70 ఏళ్లలో జరగని పనులను నాలుగేళ్లలో చేసి చూపిస్తూ పాలనారంగంలోనే వినూత్న మార్పులను కేసీఆర్ ఆవిష్కరింపచేశారు. పాలనను ప్రజల వాకిళ్లదాకా తీసుక రావటం అంటే ప్రభుత్వం కింది స్థాయి అట్టడుగు బహుజనుల దాకా వచ్చి పాలన కొనసాగిస్తుందనే అర్థమవుతుంది. రైతును శ్రమజీవిగా కాకుండా ప్రభుత్వ బంధువుగా అన్నం పెట్టే అన్నదాతగా చూసి రైతుబంధు పధకమైందీ ప్రభుత్వం. ప్రపంచీకరణ కాలంలో గ్రామాలను బతికించాలంటే గ్రామ ఆర్థిక వ్యవస్థగా నిలిచిన వ్యవసాయ రంగాన్ని దెబ్బతినకుండా చూడాలి. రైతు కూలీల ఆత్మస్థయిర్యం దెబ్బతినకుండా చూడాలి. రైతు ఆత్మహత్యలు కనిపించికుండా చేయాలి. గ్రామానికి ప్రాణమైన చెరువులను బతికించేందుకు కాకతీయ మిషన్‌ను పెట్టి ప్రభుత్వమే ఒక మిషనరీలాగా పనిచేస్తూ 18 వేల చెరువులను పూడికలు తీయించింది. మట్టికట్టలు బాగుచేయించింది. అలుగు,తూములు రిపేర్లు చేయించింది. చెరువుకు నీళ్లు తెచ్చేఫీడరు ఛానళ్లను, పంటకాల్వలను బాగుచేయించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం చెరువుకు పూర్వకళ తెచ్చింది. గ్రామానికి ప్రాణాధారం. వూరికి జీవనాధారం. కేసీఆర్ చెరువులను త్రవ్వించెను. కాల్వలను పూడిక తీయించెను. నీళ్లెక్కని పై భూములకు నీళ్లను పంపించే భగీరధునిగా మారెను…. అన్నది ఇప్పటి నడుస్తున్న వర్తమాన కాలం పాలనగా ఎవ్వరైనా చెప్పక తప్పదు. తక్కువ కాలంలో ఎక్కువ పనులు పనిచేసిన వ్యక్తిగా కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు. కాళేశ్వరం కట్టిస్తున్నాడు. ఎన్నెన్నో మూలనపడ్డ పనులను చేయిస్తూ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ఎర్రసెలకలపైకి నీళ్లను రప్పించి హరితవిప్లవాన్ని పండిస్తున్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ శకం.
దుక్కులకు నీళ్లు, ప్రతి ఒక్కరికీ మంచినీళ్లు అందించాలన్నదే ప్రథమ ప్రాథమిక కర్తవ్యం గా ఎంచుకుని మహత్తర ధ్యేయంతో ముం దుకు సాగుతున్న మానవీయ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ప్రతి ఇంటికి నల్లాకు నీళ్లిస్తేనే తిరిగి మిమ్ముల్ని ఓటడుగుతా!! లేకుంటే ఓటడగనని చెప్పిన దమ్మున్న ధైర్యశాలి, ఆచరణశీలి కేసీఆర్. ఇట్లా చెప్పుకుంటూ, చెప్పిన పని చేసుకుంటూ పోయిన పాలకుణ్ణి ఇంతకు ముందు చూడలేదు. పాలనకు జీవితాన్ని అంకితం చేసుకున్న వాళ్లు మాత్రమే ఈ పనులు చేయగలరు. కేసీఆర్ అంటే కాళేశ్వరం ప్రతిరూపం. కేసీఆర్ అంటే మిషన్‌కాకతీయ, మిషన్ భగీరధల విశ్వరూపం. కేసీఆర్ అంటే సంక్షేమ పాలన రూపకర్త. ఆత్మగౌరవ రాజ్య నిర్మాణం చేసేందుకు పాలనను కూడా ఉద్యమంగా మార్చుకుని సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న మానవీయ ప్రభుత్వం ఇది. ఆకలి లేని రాజ్యాన్ని నిర్మించటం, పేదలందరూ దారిద్య్రరేఖ నుంచి బైటపడటం, అందరికీ చదువు, అందరికీ విద్య, ధనవంతులు పేదలమధ్య సమతుల్యతను సాధించేందుకు సంక్షేమ పాలన దిశగా తెలంగాణ ముందుకు సాగుతుంది. అందుకే ఇది కేసీఆర్ శకం. రాష్ట్రం అవతరణ తర్వాత సంక్షేమం కేంద్రంగా ముందుకు సాగిన మానవీయ ప్రభుత్వంగా చరిత్రలో నిలుస్తుంది. అందుకు సంబంధించిన కృషి జరుగుతుంది.
మంత్రులను పునర్నిర్మాణానికి కర్తవ్యదారులుగా మార్చి, అంకిత స్వభావంతో పనిచేసే వ్యక్తులుగా కేసీఆర్ వారిని తీర్చిదిద్దారు. చెప్పినపని చేసుకవచ్చే కార్యసాధకుడిగా నిలిచిన గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి చేత తెలంగాణ చీకట్లను తొలగింపచేశారు. కరెంట్ కోతలేని రాష్ట్రంగా మార్చారు. ఎస్సీ గురకుల సంక్షేమ గురుకులాల్ని తీర్చిదిద్దేపనిని అప్పగించారు. ప్రజాసంబంధాలు, సామాజిక చింతనతో ఎలానిలవాలో శిక్షణనిచ్చి తన చేతులతో తీర్చిదిద్దిన హరీష్‌రావుకు కాళేశ్వరం లాంటి మహత్తర పనిని అప్పగించారు. ప్రభుత్వం ఒక మిషన్‌లాగా పనిచేస్తుందనటానికి మిషన్‌కాకతీయే నిదర్శనం. కేసీఆర్‌ది బక్క ప్రాణమే. అవును, ఆ బక్కమనిషే ఆమరణ నిరాహారదీక్షను చేపట్టి ఉద్యమాన్ని మలుపు తిప్పాడు. రాష్ట్ర సాధన స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమకారునిగా నిలిచారు. రాష్ట్రం వచ్చాక ప్రజలు ఆ సన్నమనిషికే పట్టాభిషేకం చేశారు. ప్రజలకు సేవ చేసి తరించాలన్న చింతనవున్న ఇంకో సన్నమనిషి ఈటెల రాజేంద్రను తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చేసి నడిపించారు. ఆ సన్నమనిషితో సోషల్ వెల్ఫేర్ పిల్లల కంచాల్లోకి సన్నబియ్యం పెట్టించారు. ఈ సన్నమనుషుల్ని బహుజన కంచాలు మర్చిపోతాయా? బహుజన సేవకులుగా పాలకులు మారారు. సంక్షేమపాలనకు అదే గీటురాయి.
హైదరాబాద్ చరిత్రలో మున్నెన్నడూలేని విధంగా 99 కార్పొరేటర్లను ఒక్కసారిగా ఒకే పార్టీ నుంచి గెలిపించే శక్తి సామర్థ్యాలున్న తన బిడ్డ కేటీఆర్‌ను కేసీఆర్ తెలంగాణకు అందించారు. హైదరాబాద్ నగర ముఖచిత్రాన్ని మార్చివేసి ప్రపంచీకరణ పోటీకి నిలబెట్టి మహానగర మహారూపంగా కేటీఆర్ దూసుకుపోతున్నారు. తెలంగాణ ఐటిఆర్‌గా మారిన కేటీఆర్ మహానగర మురికివాడల మూల్గులు విని వారికి అండగా నిలచే హృదయంగా మారారు. కేటీఆర్ సాంకేతిక విప్లవాలను హైదరాబాద్‌కు రప్పించే ఐటి సైనికునిగానే కాక మానవీయ కోణంలో ఆలోచిస్తూ హైదరాబాద్ నగరీకరణకు అడుగులు వేసే దశకు రావటం రాష్ట్రానికి, కేసీఆర్‌కి కలిసి వచ్చిన అదృష్టం. హైదరాబాద్ అంటే మూడవ వంతు తెలంగాణ. కేటీఆర్ హైదరాబాద్ మహానగర భవిష్యత్ చిత్ర పటాన్ని గీసుకుంటూ పోతున్నారు. ఇది తెలంగాణ భవిష్యత్తుకిస్తున్న భరోసాగా చూడాలి. కేటీఆర్ చేపట్టి నిర్వహిస్తున్న పనులు భవిష్యత్ తెలంగాణకు పెట్టుబడి. చేనేత కార్మికులు తయారుచేసిన దుస్తువులకు మార్కెట్ సౌకర్యం కల్పించి వారి చేతి మగ్గంగా మారటం సంక్షేపాలనకు సంకేతంగా చూడాలి.
కేసీఆర్ దార్శినికతతో ప్రారంభించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల గురుకులాలను ప్రారంభించి, కార్పొరేట్ విద్యావస్థను తలదన్నే విధంగా బహుజన వర్గాల పిల్లలకు చదువునందిస్తున్నారు. సంచారజాతుల పిల్లలు, పేదబహుజనాల పిల్లలు గురుకులాలకు వస్తున్నారు. బడిగడప తొక్కని వర్గాల పిల్లలకు చదవుసంచిని చేతికిచ్చి, పౌష్టికాహారాన్ని అందించి, వాళ్లను జాతిసంపదగా మార్చేందుకు కృషిచేస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మంత్రులు జోగురామన్న, గుంతకట్ల జగదీశ్వర్‌రెడ్డి, చందులాల్‌లు తమజన్మలను ధన్యం చేసుకున్నారు. గురుకులాలు విద్యారంగంలో విప్లవాలు. రాబోయే భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి అవి రహదారులుగా నిలుస్తాయి. శక్తివంతమైన నైపుణ్యం వున్న మానవసంపదను అందిస్తాయన్న విశ్వాసాన్ని ఈ గురుకులాలు ఆచరణాత్మకంగా నిరూపి
స్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం అవతరించాక ప్రభుత్వ స్కూళ్లయొక్క ఫలితాలు గణనీయంగా పెరిగాయి. ఇంటర్‌ఫలితాల్లో ప్రభుత్వకాలేజీలే అగ్రస్థానాన్ని ఆక్రమించటం తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది.
పాలన పాతవ్యవస్థకు భిన్నంగా కొత్తవ్యవస్థ నిర్మాణం చేస్తే దాన్ని కొత్తశకం అంటాం. ఈ శకానికి ఒక పొలిటికల్ హీరో ఉండాలి. ఆ లివింగ్‌హీరో గతాన్ని తిరస్కరించి నూతనత్వంతో మొదలుకావాలి. నెల్సన్‌మండేలా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా నిలిచి దక్షిణాఫ్రికా విముక్తి కోసం పోరాడారు. ఆ పోరాటాన్ని గెలిపించాడు. ఆ తర్వాత విముక్త దక్షిణాఫ్రికాను పాలించాడు. అది మండేలా శకం. కేసీఆర్ కూడా మండేలాగా ఉద్యమించారు. రాజకీయ పోరాటం చేశాడు. స్టేట్ నిర్భంధాన్ని ఎదుర్కున్నారు. రాష్ట్రాన్ని సాధించారు. ఆ తర్వాత తొలితెలంగాణ ముఖ్యమంత్రిగా పాలన కొనసాగిస్తున్నారు.రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమానికి మండేలాలాగా కేసీఆర్ పనిచేస్తున్నారు. పాతవ్యవస్థలను తిరస్కరించి కొత్తఆశలు రేకెత్తించి, కొత్త ఆలోచనలు నిర్వచించుకుని లక్ష్యాలను నిర్ధేశించుకుని కొత్తశకం నిర్మిస్తూ నాయకుడుగా ముందుకుసాగుతారు. ఇలా ఆ పొలిటికల్ హీరో ముందుకుసాగే క్రమంలో అన్ని రంగాల్లో సంతృప్తి నెలకొంటుంది. సద్భావనా ఉంటుంది. ఈ నేపధ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత కేసీఆర్ శకం మొదలై కొనసాగుతుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనతో పోల్చుకుంటే తెలంగాణలో కేసీఆర్ లివింగ్ హీరో ఎలా కొత్తశకానికి తెర ఎత్తారో అవగతమౌతుంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయాక తెలంగాణకు ఆంధ్రాకు తేడాచూస్తే శ్రీకాకుళం, చిత్తూరు జిల్లా వాళ్లతో మాట్లాడితే కలిసున్నప్పుడు, విడిపోయినప్పుడు ఉండేతేడా వారిలో అంతగా కన్పించటం లేదు. ఒక్కహైదరాబాద్‌కు వచ్చే పనిమాత్రమే వారికి తగ్గింది. ఆంధ్రప్రదేశ్ నష్టపోయామన్న భావనలోనే ఇంకా ఉంది. విభజన హామీల అమలు ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాదు, తెలంగాణకు చాలా రావాల్సి ఉన్నప్పటికినీ మొత్తంగా తెలంగాణ ధనిక రాష్ట్రమని, మనకోసం మనం కష్టపడి ముందుకు సాగిపోగలుగుతున్నామన్న విశ్వాసాన్ని కేసీఆర్ ఇక్కడి ప్రజల్లో కలిగించారు. తనపాలనతో ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించారు. ఎ.పి. బాగా నష్టపోయిందన్న ఫీలింగ్‌లోనే ఉంది. ఎ.పిలో నారాచంద్రబాబు నాయుడు పాలనను శకం అనలేం. తెలంగాణలో మాత్రం బల్లగుద్దిమరీ ఇది కేసీఆర్ శకం అని చెప్పవచ్చును.రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మెజార్టీ సెక్షన్స్ సంతృప్తిగా ఉన్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బతింటుందన్న వాదనలు బలంగా చేశారు. రాష్ట్రం వచ్చాక మున్నెన్నడూ లేని విధంగా లా అండ్ ఆర్డర్‌ను బాగా చేశారు. 19వ శతాబ్దం ప్రారంభంలో అమెరికాలో జాక్సన్‌ను ఎరా ఆఫ్ గుడ్ ఫీలింగ్స్ అనేవారు. ఇది కేసీఆర్‌కు అన్వయించబడుతుంది. ఒక నాయకుడు కొత్తశకం ప్రారంభించారని చెప్పటానికి గుర్తులు ఏమంటే ఆ సమయంలో, ఆ సమాజం అన్ని రంగాలలో పూర్తిగా ప్రజాస్వామికీకరణ చెందటం. అంటే గతం కంటే పాలన అంతా పాతకు భిన్నంగా కొత్తగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు అధికారమివ్వటం చేశారు. చిన్నతండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించారు. 31జిల్లాలను ఏర్పాటు చేసి పాలనను మరింత ప్రజలకు చేరువగా తీసుకపోవటం జరిగింది. అధికారాలను చాలా వరకు కిందిస్థాయికి బదిలీచేయటం జరిగింది. ఇలా అన్ని రంగాలలో నూతనత్వాన్ని ఆవిష్కరిస్తూ విప్లవాత్మక చర్యలు తీసుకుంటూ ప్రజాస్వామికీకరణ చేసుకోవటం జరుగుతుంది. ఇలా వ్యవస్థను ముందుకు నడిపిస్తూ సాగటం అన్నది పాలకుడైన ఆ మనిషి పేరున శకం అవుతుంది. తెలంగాణలో కేసీఆర్ పాలనారంగంలో విప్లవాత్మకమైన చర్యలు చేపడుతున్నారు. అందుకే ఇది కేసీఆర్ శకం.
మనల్ని పరిపాలించే డాక్యుమెంట్‌ను, ఇన్నేళ్ల తర్వాత వస్తున్న ఇబ్బందులను ప్రశ్నిస్తారు. పాలించే డాక్యుమెంట్ అమలులో ఎలా ఉంది? దాన్ని ఆమూలగ్రంగా పరిశీలించడం, అవసరమైతే మార్చుకుంటూ మార్పుకు శ్రీకారం చుట్టాలని తలంచుతారు. ఇది కొత్తశకం నాయకుల లక్షణాలుగా చూడాలి. మన ఫెడరల్ వ్యవస్థ సరిగా అమలు జరగటం లేదు. ఇది తిరిగి పునర్నిర్వచింపబడాలని కేసీఆర్ దేశవ్యాపితంగా నూతన ఉద్యమం చేపట్టేందుకు ముందుకు వస్తున్నాడు. మా వూరులో రోడ్డు వేసుకునేందుకు కేంద్ర నిధులివ్వటం ఏమిటి? కేంద్రాన్ని అడుగుకోవటం ఏమిటని అడుగుతున్నారు. రీడిజైనింగ్ గవర్నింగ్ డాక్యుమెంట్ (పునర్నిర్మాణ ప్రతి) అన్నది ఒక కొత్తశకం నాయకుడు చేసే పని. అలా కొత్త శకం నాయకుని వల్ల రాజ్యాంగ సంస్కరణలు వస్తాయి. ఆయన టైంలో ఆర్థికాభివృద్ధి సమృద్ధిగా ఉంటుంది. కేంద్రం జిడిపి కంటే ఇపుడు తెలంగాణ జిడిపి ఎక్కువ. తెలంగాణ జిడిపి 10.4 శాతం ఉంటే, దేశం జిడిపి 6.2 శాతం ఉంది. డాలర్లలో చూస్తే తెలంగాణ జిడిపి 130 బిలియన్ డాలర్లు. 201718 వ ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం చూస్తే దేశంలో తెలంగాణ జిడిపి అభివృద్ధిలో 8వ స్థానంలో ఉంది. తెలంగాణలో ఎకానమిక్ గ్రోత్ బాగా పెరుగుతుంది. అభివృద్ధి అంటే కొద్దిమంది ధనికులే కాకుండా అది సమాజంలోని అందర్నీ నిలిపేవిధంగా ఉండాలి. సమాజంలో కొందరే ధనవంతులు మిగతావారంతా కడునిరుపేదలే అనే తారతమ్యం తగ్గిస్తూ అభివృద్ధి అందర్నీ కలుపుకుపోయే ఇన్‌క్లూజివ్ గ్రోత్‌కావాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ రకమైన అభివృద్ధిని సాధించేందుకు కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అది గొర్రెలపెంపకం, చేపల పెంపకం కావొచ్చును. సిరిసిల్ల నేతకార్మికుల అవసరాలను తీర్చే పనులు కావచ్చును. దళిత, గిరిజనులకు అందిస్తున్న పలురకాల సంక్షేమ కార్యక్రమాలు వీటివల్ల వ్యవస్థలో ఇన్‌క్లూజివ్ గ్రోత్ ఉంటుంది. అంటే సమాజంలో ప్రతిఒక్కరికి సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే పేదరికం కారణంగా బాధపడేవారు ప్రభ్వుత్వం నుంచి ఏదో ఒక సాయం పొందేలా చూస్తారు. ప్రభుత్వం వైపు నుంచి ఏదో ఒకటి అందుతుంది. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు అన్ని రకాల సాయం అందేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలో చేయలేదు. ఆ ఖ్యాతి కేసీఆర్‌కే దక్కుతుంది.
సరిగ్గా తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తొలితెలంగాణ పాలనాపగ్గాలు చేపట్టిన కేసీఆర్ కొత్త అభివృద్ధి నమూనాకు రూపకల్పన చేశారు. ప్రతిరంగాన్ని పునఃసమీక్షిస్తూ పోయారు. నాలుగేళ్లుగా ప్రతిరంగాన్ని క్షుణ్ణంగా చర్చిస్తూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలను రూపొందిస్తూ ముందుకుసాగుతున్నారు. పాత పాకుడు పట్టిన రొట్టకొట్టుడు విధానాలను చెక్కివేయటం మొదలైంది. కేసీఆర్ నాలుగేళ్లలో అన్ని రంగాల్లో పాకుడుబట్టినపూడికను తొలగించివేశారు. ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణను పోల్చితే తెలంగాణలో మధ్యతరగతి తక్కువగా ఉంది. రాష్ట్ర అవతరణ తర్వాత ఇక్కడ పేదరికం తగ్గి పేదవర్గాలు క్రమంగా పెరిగే పరిస్థితి వస్తుంది. కొత్తవర్గాల వాయిస్ వస్తుంది. నిరుపేదలు స్థిరపడే స్థితికి బలమైన పునాదిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పరిచేందుకు అన్ని రంగాలను శక్తివంతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ప్రపంచవ్యాపితంగా అన్ని దేశాలలో పేదలు, ధనవంతులు మాత్రమే ఉన్నారు. మధ్యతరగతి వర్గం కూడా క్రమంగా కనిపించని కొత్తరూపానికి వెళ్లిపోతుంది. అట్టడుగున ఉన్న ప్రజలు, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్‌క్లాస్, నియోరిచ్ అనే నాలుగుదశలు అంతమై పోయి మొత్తం దేశదేశాల్లో వ్యవస్థలు పేద,ధనవంతులుగా స్థిరీకరించబడే ఒక దశకు వచ్చిందంటున్నారు.
మధ్యతరగతి రావటం వల్ల వచ్చే దుర్గుణాలు కూడా కొన్ని లేకపోలేదు. ఒక రకంగా మధ్యతరగతి త్రిశంకు స్వర్గం లాంటిది. మధ్యతరగతి మొదలైతే సమాజ ఆర్థిక పతనం కూడా మొదలౌతుందన్న వాదనలు చేసే విశ్లేషణలు కూడా లేకపోలే దు. చిట్‌ఫండ్స్ కంపెనీలు, వస్తువులపై మోజులు పెంచుకోవటా లు, అప్పు జేసి వస్తువుల కొనుగోళ్లు చేయటాలు మధ్యతరగతి వల్ల విపరీతంగా పెరుగుతాయి. మధ్యతరగతిలో ఉన్న కొందరికి కారు కొనే దశ ఉండ దు. కానీ కారు కొంటాడు. ఎల్‌ఇడి టీవీలు కొనే ఆర్థిక స్థితి ఉం డదు. కాని కొంటారు. ఇది వ్యవస్థను అతలాకుతలం చేసే పరిస్థితి అవుతుంది. అందుకే పేదల జీవనం విధానం మెరుగుదలకు ఏంచేయాలన్న దిశగా తెలంగాణ ప్రభుత్వం భారీగా కసరత్తుచేస్తుంది. ఈ రకమైన ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యంలో సమత్వాన్ని సాధించే యత్నం అనవచ్చును. పేదల జీవన ముఖచిత్రం మార్చడానికి డెమోక్రసీ ప్లస్ సోషలిజం కలిసి సోషియోక్రసీ అన్న కొత్తవిధానాన్ని కేసీఆర్ సృష్టిస్తున్నారు. ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని మెరుగపరుస్తూ ఆ స్థాయికి తగ్గవిధంగా జీవన విధానం ఉండేవిధంగా రూపకల్పన చేస్తున్నారు. తెలంగాణాలో పేదలు ఒక మెరుగైన ఆర్థికజీవన విధానంలోకి అడుగుపెట్టడానికి కావాల్సిన ఆర్థికసూత్రాలను, నూతనవిధానాలను చేపట్టడం కోసం ఈ నాలుగేళ్లపాలన నిరంతరం శ్రమిస్తూ వస్తుంది. నియోరిచ్‌లో, మధ్యతరగతిలో ఉండే దుర్లక్షణాలు లేకుండా పేదలను మెరుగైన జీవనవిధానంవైపు తీసుకువెళ్లే వ్యవస్థను నిర్మించడానికి కేసీఆర్ కృషిచేస్తున్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అన్నిరంగాల్లో శిసెత్తుకుని నిలిచేందుకు విద్యారంగం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక దారివేస్తూపోతుంది. సంక్షేమ రంగాల ద్వారా బహుజనులను ఆదుకోవటం, వారిని నిలబెట్టే పని మొదలైంది. ప్రజాస్వామ్యం పకడ్భందీగా ఉంది. అల్పసంఖ్యాక బహుజన వర్గాలకు, మైనార్టీలకు దేశంలో ఎక్కడాలేని విధంగా సంపూర్ణ రక్షణ ఉంది. దీనికి కర్త, కర్మ, క్రియ కేసీఆర్. అవును ఇది కేసీఆర్ శకం. సమాజంలోని అగ్రవర్ణ పేదలకు సాయం అందించే పనిని కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అగ్రవర్ణపేదలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వటం, బ్రాహ్మణ సమాజంలోని పేదలకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సాయం అందించేపని మొదలైంది. అంటే వ్యవస్థలో వున్న పేదలను దారిద్య్రరేఖకు దిగువన పడిపోకుండా చేస్తుంది. అదే విధంగా వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతామని, ఈ చట్టానికి అతీతుణ్ణి అనేదాన్ని లేకుండా చేస్తుంది. వ్యవస్థలో అక్రమ సంపాదనకు అవకాశం లేకుండా చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించాక కేసీఆర్ ఆలోచనతో, దార్శనికతతో, ఇప్పటి వరకు కొనసాగిన పాలనకు భిన్నంగా, కొత్తవ్యవస్థ నిర్మాణ పనులు మొదలై ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణ వచ్చాక తొలిముఖ్యమంత్రి కేసీఆర్ చేసేది ముచ్చటగా పరిపాలన మాత్రమే కాదు, మొత్తం వ్యవస్థను కొత్తదారుల్లోకి తీసుకపోయి నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ శకం. ఇక భవిష్యత్ తెలంగాణ చరిత్ర అన్నది కేసీఆర్‌కు ముందు కేసీఆర్ తర్వాతననే చర్చతోటే కొనసాగుతుంది.
తొలి తెలంగాణమున కేసీఆర్ ఉండెను ఆయన తెలంగాణను పునర్నిర్మించుకుంటూ సాగుతుండెను తెలంగాణ సంక్షేమ పాలనకు ప్రతిరూపంగా నిలిచెను ఇది తెలంగాణ రాష్ట్రపాలనా చరిత్ర మొదటి అధ్యాయం
– జూలూరు