పాత తరం సినిమాల్లో కామెడీ నటిమణుల్లో రమా ప్రభ ఒకరు. పాత తరం నటీనటులతోనే కాదు .. నేటి తరం నటీనటులతోను కలిసి రమాప్రభ చాలా సినిమాల్లో నటించారు. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మాజీ ముఖ్యమంత్రి జయలలితకు గురించి ఎన్నో విషయాలు చర్చించారు.
ముఖ్యంగా తన స్నేహితులు, బంధువుల గురించి ఎంతో శ్రద్ద వహించే వారు. జయలలితకు .. నాకు మధ్య ఎంతో సాన్నిహిత్యం వుండేది. నా కోసం ఆమె ఎన్నో మార్లు ఫోన్లు చేసింది .. అయినా నేను వెళ్లలేద ఆమె అన్నారు. అయితే రమాప్రభ ప్రస్తుతం చిత్తూరు జిల్లా ‘మదనపల్లి’లో ఉంటున్నారు.ఇప్పుడు హైదరాబాద్ లో కాదు గదా నా పేరుతో నా కంటూ ఎక్కడా ఏమీ లేదు.. ఆస్తులు అలా వచ్చాయి .. ఇలా పోయాయి అన్నారు. ఇక టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి ఎనాటి అనుబంధమో కానీ…నాకు ప్రతి నెల కొంత డబ్బు పంపిస్తున్నాడు. వాస్తవానికి పూరితో నేను ఎక్కువ సినిమాలు తీయకపోయినా.. తాను మాత్రం ఎక్కువ బంధం లేకపోయినా ఆయన సహాయం చేస్తున్నాడు. ఇది పూర్వజన్మ బంధమనీ .. రుణాను బంధమని నేను అనుకుంటూ వుంటాను” అని టాలీవుడ్ డైరెక్టర్ జగన్ అంటూ చెప్పుకొచ్చారు