తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు ఉద్యమ సమితి అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్‌రెడ్డి సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. మత్రి హరీశ్‌రావు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలకు తక్షణం పరిష్కారం చూపుతూ ప్రజా నేతగా పేరొందిన హరీశ్‌రావుకు.. ఇచ్చిన గిఫ్ట్ ఏమిటి..? ఇంతకీ హరీశ్‌రావుకు ఎందుకు గిఫ్ట్ ఇచ్చాడు..? ఎక్కడ ఇచ్చారు..? అన్న విషయాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే మరీ..!
జూన్ 3వ తేదీ ఆదివారం మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజు అన్న విషయం ప్రతీ ఒక్కరికి విధితమే. ఈ నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ్ స్వామి ఆలయంలో తెలంగాణ ఉద్యమ కారుడు, ఉద్యమ సమితి అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్‌రెడ్డి మంత్రి హరీశ్‌రావుపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులతో ఆలయానికి కొంతదూరంలో ఉన్న సముద్రం పక్కనే సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మిషన్ కాకతీయ, సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించడంలో తనవంతు పాత్ర పోషిస్తూ తెలంగాణలో ప్రజలకు నీటి సమస్య లేకుండా చేయడంలో అహర్నిశలు కష్టపడుతున్న మంత్రి హరీశ్‌రావు రేపు ఆదివారం జన్మదినాన్ని పురస్కరించుకుని సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో ఆ సైకత శిల్పంలో ఒక పక్క తెలంగాణ భవనాన్ని ఉంచారు. మరో వైపు తెలంగాణ నీటి ప్రాజెక్టులు మరో క్క.. మధ్యలో హరీశ్‌రావు ఉన్న సైకత శిల్పం చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. దీన్ని ఉద్దేశించి ఆకుల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఏమి వస్తదో చెప్పడానికి బీడుపడ్డ పొలాలకు నీళ్ళు ఇవ్వడం కోసం రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ సుడిగాలి సిగ్గుపడేలా ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతూ అహర్నిశలూ శ్రమిస్తున్న నాటి ఉద్యమ సేనాధిపతి.. నేటి తెలంగాణ భగీరథుడు మన గౌరవ పెద్దలు హరీష్ రావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు …. ఒడిశా రాష్ట్రంలో పురి జగన్నాథ్ స్వామి వారి ఆశీర్వాదాలతో సముద్రం పక్కనే సైకత శిల్పాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగింది నాతో పాటే మా టీం సహకరించిందని అన్నారు.