బాహుబలి చిత్రం తరువాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఏ చిత్రాన్ని తెరకెక్కిస్తాడో అంటూ ఆయన అభిమానులు తెగ ఎదురు చూశారు. అయితే, రాజమౌళి ఏ చాత్రాన్ని తెరకెక్కించినా అందులో ఏదో ఒక స్పెషల్ ఎలిమెంట్స్ ఉండేలా చూస్తాడు. అంతేకాకుండా, సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా..? అంటూ అభిమానులు ఎదురు చూసేతా ఆసక్తిని కలగజేస్తాడు రాజమౌళి.
అయితే, అందరు భావించినట్టే రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నట రుద్రుడు ఎన్టీఆర్‌తో ఆర్ఆర్ఆర్ అనే చిత్రాన్ని రూపొందించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే టైటిట్ విడుదల చేసిన రాజమౌళి, కథను ఓ కొలిక్కి తీసుకొచ్చే పనిలో పడ్డాడట జక్కన్న. అయితే, ఈ చిత్రంలో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్‌గాను.. ఎన్టీఆర్ గ్యాంగ్‌స్టర్‌గాను నటించనున్నాడంటూ చిత్రపురి కాలనీలో ఓ టాక్ వినిపిస్తోంది.