తెలుగు సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల్లోనూ తనదైన శైలిలో రాణించి ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వ్యక్తుల్లో పోసాని మురళీ కృష్ణ ఒకరు. అంతేకాకుండా, మనస్సులో ఉన్నది ఉన్నట్టు, ఎదుటి వ్యక్తి ఎంత వారైనా నిఖార్సుగా నిజాలు మాట్లాడే వ్యక్తి. ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, అలాగే మంత్రి నారా లోకేష్ అవినీతిపై తన గళంతో ఏకి పారేశారు పోసాని. అయితే, ఆదివారం ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని మురళీ కృష్ణ ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరో సంచలనమైన జాతీయ సర్వే..వైసీపీ 150 సీట్లు ..టీడీపీ 20.. ఇతర పార్టీలు 5
ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై తనకు నమ్మకం ఉందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఏపీ బాగుపడుందని పోసాని మురళీ కృష్ణ అన్నారు. జగన్ లాంటి వ్యక్తి సీఎం అయితే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో జగన్ పాదయాత్రలో పాల్గొన్నానని, జగన్‌కు సంఘీభావం తెలిపానన్నారు.
వారిద్దరి కలయికతో.. చంద్రబాబుకు ఇక చుక్కలే..!
అయితే, జగన్‌ను కలిసిన తనపై పచ్చ మీడియా అసత్య ప్రచారం చేసిందన్నారు. జగన్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశాడని, అందుకే పోసాని మురళీ కృష్ణ జగన్‌ను కలిశాడని అంటూ పచ్చ మీడియా ప్రచారం చేసిందన్నారు. అయితే, జగన్ అంటే తనకు అభిమానమని, అందుకే జగన్‌ను కలిసినట్టు పోసాని చెప్పారు. తనకు పదవులపై, టిక్కెట్లపై ఆశ లేదని పోసాని స్పష్టం చేశారు.