హిందీ బిగ్‌బాస్ సీజన్ 11లో నటి, మోడల్ అర్షి ఖాన్ పేరు బిగ్ బాస్ ఇంట్లో మాత్రమే కాదు, బయట కూడా మారుమ్రోగి పోతోంది. గతంలో ఎన్నో సంచలన ప్రకటనలు చేసిన అర్షి ఖాన్ తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పటికీ కొనసాగుతూనే వస్తోంది. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీతో ప్రేమాయణం కొనసాగించానని, అతనితో ఏకాంతంగా గడిపా(శృంగారంలో పాల్గొన్నా) అంటూ ఆమె చేసిన ట్వీట్ తీవ్ర దుమారం అప్పట్లో రేపింది. ఆ దెబ్బకి అర్షి పేరు మీడియాలో మారుమోగిపోయింది.
ఒక రకంగా బిగ్‌బాస్ హౌజ్‌కు సెలబ్రిటీగా ఆమెకు ఛాన్స్ దక్కటానికి కూడా కారణం ఆ వ్యవహారమే. అయితే 2015లో ట్వీట్ చేసిన తర్వాత అఫ్రిదీ గురించి, ఆ ట్వీట్ గురించి ఆమె ఎక్కడా నోరు మెదపలేదు. తాజాగా ఓ ఛానెల్ చిట్‌ఛాట్ ప్రొగ్రాంలో నటి రాఖీ సావంత్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్వీట్ ప్రస్తావన రాగా, ఆమె స్పందించారు. ‘అఫ్రిదీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన నా కోసం ఎంతో చేశారు. ఆ ట్వీట్ చేయటం నా పొరపాటే. ఆయన్ని అనవసరంగా ఇందులోకి లాగాను. ఆయన్ని క్షమాపణలు కోరుకుంటున్నా’ అంటూ అర్షి పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. అసలు షాహిద్ అఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నట్లు అర్షి చెబుతున్నదాంట్లో నిజం లేదని, అసలు ఆవిడ అఫ్రిదిని ఎప్పుడూ కలవలేదని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని, కేవలం పబ్లిసిటీ కోసమే ఇవన్నీ చెప్పుకుంటోందంటూ గెహానా తెలిపారు.
Yes, I had sex with Afridi! Do I need the Indian media's permission to sleep with someone? It's my personal life. For me it was love.
— Arshi Khan (@ArshiKOfficial) September 8, 2015