తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు సిరిసిల్ల లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ముందుగా మంత్రి కేటీఆర్ గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ..ఎన్నో మైలురాళ్ళను అధిగామించామన్నారు.
Minister @KTRTRS speaking at the Telangana Formation Day event in Rajanna Sircilla district. pic.twitter.com/PzV0wkIHmB
— Min IT, Telangana (@MinIT_Telangana) June 2, 2018
ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సమర్థ నాయకత్వంలో.. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకరం చేసుకున్నామని అన్నారు.నాలుగు సంవత్సరాల అపనమ్మకాల నుంచి రాష్ట్ర ప్రజలను ముందుండి నడిపిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు.రైతన్నకు స్వర్ణయుగం వచ్చిందని, రైతు బంధుతో రైతుల జీవితాలు మారాయన్నారు. రైతు బంధువు పథకం ఇచ్చిన సంతృప్తి.. మరో పథకం ఇవ్వలేదని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అయిదవ వసంతంలోకి అడుగుపెట్టిందని చెప్పారు.
IT & Industries Minister @KTRTRS receiving Guard of Honour at Telangana Formation Day celebrations in Rajanna Sircilla district. pic.twitter.com/ANNM9JLvEv
— Min IT, Telangana (@MinIT_Telangana) June 2, 2018
Minister @KTRTRS paying tributes to Telangana martyrs at Martyrs Memorial on Telangana Formation Day in Rajanna Sircilla district. Vemulavada MLA Dr. Chennamaneni Ramesh and @Collector_RSL Krishna Bhaskar also participated. pic.twitter.com/FwkIIIqjLT
— Min IT, Telangana (@MinIT_Telangana) June 2, 2018