Home / ANDHRAPRADESH / చంద్ర‌బాబు అనే నేను..!

చంద్ర‌బాబు అనే నేను..!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ జోగి రమేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించిన వంచ‌న‌పై గ‌ర్జ‌న స‌భ‌లో జోగి ర‌మేష్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌పై ఉన్న నోటుకు ఓటు స‌హా ఉన్న ప‌లు కేసుల భ‌యంతోనే ఏపీ ప్ర‌జ‌ల హక్కు అయిన ప్ర‌త్యేక హోదా అంశాన్ని కేంద్రం వ‌ద్ద తాక‌ట్టు పెట్టార‌న్నారు.

సూపర్ స్టార్ కృష్ణ వైఎస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలకు..గల్లా జయదేవ్ షాక్

ఆ సంద‌ర్భంలోనే చంద్ర‌బాబు అనే నేను అంటూ ప్రారంభించిన జోగి ర‌మేష్ మాట్లాడుతూ..

చంద్ర‌బాబు అనే నేను
వెన్నుపోటు దారుణ్ణి..!
మోస‌గాడ‌ణ్ణి..!
అవినీతి ప‌రుణ్ణి..!
మా మామ ముఖ్య‌మంత్రి పీఠాన్ని లాక్కున్న వాణ్ణి..!
మా తోడ‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావును ముంచిన వాణ్ణి..!
పిల్ల‌నిచ్చిన మామ‌ను రాళ్ల‌తో, చెప్పుల‌తో, క‌ర్ర‌ల‌తో కొట్టిన వాణ్ణి..!
మా వ‌దిన పురందేశ్వ‌రి గారిని ముంచిన వాణ్ణి…!
మా బామ్మ‌ర్దులు హ‌రికృష్ణ‌, బాల‌కృష్ణ‌, రామ‌కృష్ణ‌, ఆ కృష్ణ‌, ఈ క‌ష్ణ నెత్తిమీద చేతులు పెట్టిన వాణ్ణి..!
రైతుల‌కు రుణ‌మాఫీ చేస్తాన‌ని, రైతుల‌ను ముంచిన వాణ్ణి..!
డ్వాక్రా రుణాల‌ను ర‌ద్దు చేస్తామ‌ని చెప్పి అక్కా చెల్లెళ్ల నెత్తిమీద చేయి పెట్టిన వాణ్ణి..!
ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తాన‌ని చెప్పి నిరుద్యోగులంద‌రినీ మోసం చేసిన వాణ్ణి..!
ఇలా చంద్ర‌బాబు ప్ర‌తిజ్ఞ గురించి చెప్పుకుంటూ పోతే చాలా విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని జోగి ర‌మేష్ అన్నారు.

మంచు విష్ణు జ‌గ‌న్‌ను ఏమ‌ని పిలుస్తాడో తెలుసా..??

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat