ఏపీ అధికార టీడీపీ నేత ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కుమ్మక్కై పవన్ ,జగన్ టీడీపీ పార్టీకి ,ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అని విమర్శించారు .
ఏపీలో చంద్రబాబుకు పెద్ద షాక్…అనకాపల్లి టీడీపీ ఎంపీ..వైసీపీలోకి
జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియాకు కేంద్ర ప్రభుత్వం కొన్ని వందల కోట్ల విలువ చేసే ప్రకటనలు ఇస్తున్నారు అని ఆయన దుయ్యపట్టారు .గత నాలుగు ఏండ్లుగా మంచిగా కన్పించిన తమ ప్రభుత్వం గత కొన్నాళ్లుగా టీడీపీ ప్రభుత్వం ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలు చేసే విధంగా కన్పిస్తున్నాయి అని అనడం పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణితికి నిదర్శనం అని ఆయన అన్నారు ..