ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై సినీ నటుడు పృథ్వీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ,ఇవాళ నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వంచనపై గర్జన సభలో పాల్గొన్న పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఉన్న నోటుకు ఓటు సహా ఉన్న పలు కేసుల భయంతోనే ఏపీ ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారన్నారు.
తాను థర్టీ ఇయర్స్ ఇడస్ట్రీ డైలాగ్‌తో సినిమా రంగంలో రాణిస్తున్నానని, కానీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటూ 40 ఏళ్ల ప్రతిపక్ష నేత జగన్‌కు భయపడుతున్నారన్నారు. తాను 2014లో ఇడుపులపాయలో జగన్ సమక్షంలో వైసీపీ చేరానని గుర్తు చేశారు. మాట తప్పని, మడమ తిప్పని నేత వైఎస్ జగన్ అని చెప్పారు పృథ్వీ రాజ్.