ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తీరని అన్యాయంపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పార్టీ పోరు ముమ్మరం చేసింది. నవనిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరిపై వైసీపీ గర్జించింది. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోర వైఫల్యం, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం నెల్లూరులో ‘వంచనపై గర్జన’ దీక్ష చేపట్టింది. నెల్లూరులోని వీఆర్ కళాశాల మైదానంలో ఉదయం నుంచి సాయంత్ర 5 గంటల వరకు ‘వంచనపై గర్జన’ నిరాహార దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో పదవులకు రాజీనామాలు చేసిన ఐదుగురు వైఎస్సార్ సీపీ లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. నల్లదుస్తులు ధరించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ.. నేతలు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రసంగించారు. వారు ఏమన్నారంటే..
మూడో వసంతంలోకి వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్
హోదా పోరాటానికి అంబాసిడర్ వైఎస్ జగన్..
ప్రత్యేక హోదా పోరాటానికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నీతి, నియమాలు లేవని, కేవలం కుట్ర పూరిత రాజకీయాలు చేయడమే ఆయనకు అలవాటంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అనేక దుర్మార్గాలు చేశారు కాబట్టి హోదాపై మాట మార్చారని చెప్పారు. ప్రస్తుతం ఏం చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలకు చంద్రబాబు దగ్గరవుతున్నారని పేర్కొన్నారు.